ముద్దుల ప్రియుడిని కాదు.. టైమ్, డబ్బు బొక్కనే.. సమంతతో విజయ్ దేవరకొండ
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో దసరా మహా ఎపిసోడ్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన తర్వాత సమంత అక్కినేని ఫుల్‌టైమ్ హోస్ట్‌గా మారారు. ఆహా యాప్‌లో సామ్ జామ్ అనే రియాలిటీ షోను దీపావళీ పండుగ సందర్భంగా ప్రారంభించారు. సామాజిక అంశాలు, రియల్ లైఫ్ హీరోలను వేదికపైకి ఆహ్వానించారు. ఈ షోకు విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంతతో మాట్లాడుతూ..

లాక్‌డౌన్‌లో జీవితం అలా
లాక్‌డౌన్‌లో ఇంటి పనులు ఎక్కువగా చేయలేదు. మొదటి రెండు నెలలు కిచెన్‌లోకి వెళ్లి హెల్ప్ చేయాలనిపించింది. ఆ తర్వాత జీవితం మరింత బోర్‌గా మారింది. నాకు ఎక్కువగా ఇంటి పనులు చేయడం తెలియదు. అదంతా అమ్మ సెక్షన్. హీరో అయిన తర్వాత సూపర్ మార్కెట్‌కు వెళ్లి నిత్యావసర వస్తువులు కొనడం లేదు. అయితే హీరో కాకముందు యూసఫ్ గూడ బస్తీలో కూరగాయల సంతకు అమ్మతో వెళ్లి వస్తువులు తెచ్చుకొనే వాళ్లం అని విజయ్ దేవరకొండ తెలిపారు.

నేను అలాంటి వాడిని కాదు
నన్ను దానధర్మాలు చేస్తారని అందరూ అనుకొంటారు. కానీ నేను అలాంటి వాడిని కాదు. అయితే నాకు నచ్చినప్పడు ఏదైనా సహాయం చేయాలంటే చేస్తాను. కొన్నిసార్లు నాకు నచ్చకపోతే చేయను. అందువల్ల నేను దానాలు చేస్తానని చెప్పుకోను. ఎవరేమీ అనుకొన్నా నేను దానిని పట్టించుకోను అని విజయ్ దేవరకొం చెప్పారు. అయితే షోకు హాజరైన ఆడియెన్స్ విజయ్ వాదనను అంగీకరించకపోవడం గమనార్హం.

లైఫ్‌ను తీసేస్తానని విజయ్ దేవరకొండ
ఇక లాక్‌డౌన్‌లో కొద్ది నెలలు చాలా హ్యాపీగా గడిపాను. గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రతీ రోజు షూటింగులతో విసిగిపోయాను. లాక్‌డౌన్ వచ్చిన తర్వాత రెండు నెలలు ఫుల్లుగా తిని, పడుకొన్నాను. ఆ తర్వాత ఎంత నష్టపోతున్నాం తెలిసింది. అప్పుడు టైమ్ బొక్క.. డబ్బు బొక్క నాకు అనిపించింది. ఈ సంవత్సరం నా కెరీర్ నుంచి, లైఫ్ నుంచి తీసేయాలని డిసైడ్ అయ్యారు అంటూ విజయ్ దేవరకొండ అన్నారు.

ముద్దుల ప్రియుడిని కాదు..
ఇక సీరియల్ కిస్సర్ అనే ట్యాగ్ నాకు సరిపోదు అంటూ సమంత ఇచ్చిన ఓ ఆప్షన్‌పై విజయ్ దేవరకొండ స్పందించాడు. నా సినిమాల్లో హీరోయిన్లు ముద్దు పెట్టుకోవడం పక్కన పెడితే.. మహానటిలో నటించినప్పటికీ.. నేను సమంతను ఒక్కసారి కూడా ముద్దుపెట్టుకోలేదు. కాబట్టి నేను సీరియల్ కిస్సర్‌ను కాదు అంటూ విజయ్ దేవరకొండ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Recommended Video

మానసికంగా బాధపడితే...
ఎవరైనా మానసిక రుగ్మతతో బాధపడితే అలాంటి సిట్యుయేషన్‌ను దాచుకోవద్దు. వైద్యులు, మానసిక నిపుణులను సంప్రదించాలి. తమలో తాము కుమిలిపోకూడదు. ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవాలి. రిలేషన్స్ పెంచుకోవాలి. మానసికంగా బలంగా మారాలి. జీవితంలో ఎగుడుదిగుడులు సర్వసాధారణం అనే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలి అంటూ విజయ్ దేవరకొండ అన్నారు.


Click it and Unblock the Notifications











