నెట్టింట వైరల్‌గా మారిన ప్రభాస్ తండ్రి పిక్.. అచ్చం నాన్న లాగే యంగ్ రెబల్ స్టార్ అంటూ!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న పేరిది. గతంలో ఏ తెలుగు హీరో కూడా సాధించినంత ఖ్యాతి ప్రభాస్ సంపాదించారనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ ఖ్యాతి ఎల్లలు దాటింది. ఎంతో క్రేజ్ ఉన్న ఈ స్టార్ హీరోలో అచ్చం వాళ్ళ నాన్న పోలికలే ఉన్నాయంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాలు చూస్తే..

కృష్ణం రాజు వారసుడిగా గుర్తింపు
ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరపై కాలుమోపిన ప్రభాస్.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే దేశ విదేశాల్లో అశేష అభిమాన వర్గాలను కూడగట్టుకున్నారు. అయితే ఇప్పటికీ ప్రభాస్‌కి కృష్ణం రాజు వారసుడిగానే మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.

చిన్నప్పటి నుంచే సినిమాలతో రిలేషన్
నిజానికి ప్రభాస్‌కి చిన్నప్పటి నుంచే సినిమాలతో రిలేషన్ ఉంది. ఎందుకంటే ఆయన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు అప్పట్లో యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్. అన్నయ్య కృష్ణం రాజుకు అండగా ఉంటూనే గోపీకృష్ణ మూవీస్ పతాకంపై ఆయన సినిమాలు తీసేవారు. ఆ సమయంలో ప్రభాస్‌ని వెండితెరపై అడుగుపెట్టమని ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు ఎన్నోసార్లు అడిగినా ప్రభాస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట.

స్టార్ హీరోగా ఎదుగుతున్న తరుణంలో తండ్రి మరణం
అయితే ఎలాగోలా సినీ గడప తొక్కిన ప్రభాస్.. యంగ్ రెబల్ స్టార్‌గా అనతి కాలంలోనే భారీ క్రేజ్ సంపాదించారు. బాహుబలి లాంటి భారీ సినిమాతో ఊహించని రేంజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఈ రేంజ్ చూసి ఆనందించడానికి, గర్వపడటానికి పక్కన తన తండ్రి లేరనే లోటు ప్రభాస్‌ను బాధపెడుతూ ఉంటుంది. స్టార్ హీరోగా ఎదుగుతున్న తరుణంలోనే ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు 2010 సంవత్సరంలో మరణించారు.

ప్రభాస్ ప్రెసెంట్ లుక్.. అచ్చం తండ్రి లాగే అంటూ
ఇటీవలే సాహో రూపంలో మరో భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ప్రభాస్. ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం దేశమంతా పర్యటించారు. అయితే ప్రస్తుతం ఆయన రూపురేఖలు చూసి.. అప్పట్లో యంగ్ లుక్‌లో అచ్చం వాళ్ళ నాన్న సూర్యనారాయణ రాజు లాగే ఉన్నారని చెప్పుకుంటున్నారు సినీ జనం. ఈ మేరకు ప్రభాస్, యంగ్ ఏజ్‌లో ఆయన తండ్రి ఫోటోను పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సాహో సునామీ..
మరోవైపు సాహో సినిమా తొలుత మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ 300 కోట్లకు చేరువగా వచ్చింది. చిత్రంలో ప్రభాస్, శ్రద్ద కపూర్ నటన, టెక్నికల్ వాల్యూస్ విశేష ఆదరణ పొందుతున్నాయి.


Click it and Unblock the Notifications











