అన్నపూర్ణ స్టూడియోలో విరాట్ కోహ్లి-అఖిల్ అక్కినేని... ఏం జరుగుతోంది?
ప్రముఖ క్రికెట్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయనో పెద్ద సెలబ్రిటీ, ఇందులో విచిత్రం ఏముందీ? అనుకుంటున్నారా? కోహ్లి వేరే ఎక్కడో దర్శనమిస్తే అదో పెద్ద న్యూస్ కాక పోవచ్చు.... హైరాబాద్‌లో, అందులోనూ అన్నపూర్ణ స్టూడియోలో కనిపించడం, అతడి పక్కనే అఖిల్ అక్కినేని కూడా ఉండటం హాట్ టాపిక్ అయింది.
వెనక సెటప్ చూస్తుంటే ఏదో యాడ్ ఫిల్మ్ షూటింగ్ అనిపిస్తోంది. అయితే అక్కినేని చిన్నోడు అఖిల్ కేవలం అభిమానంతో అతడిని కలవడానికి వచ్చాడా? లేక ఈ యాడ్ ఫిల్మ్‌లో అతడు కూడా నటిస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.

విరాట్‌కు అఖిల్ వీరాభిమాని
విరాట్ కోహ్లికి అఖిల్ అక్కినేని వీరాభిమాని. తన అభిమాన క్రికెటర్‌ను కలిశాననే ఆనందం అతడిలో కనిపిస్తోంది. అయితే ఇది రియలా? యాడ్ ఫిల్మ్ షూటింగులో అఖిల్ కూడా భాగం అయ్యాడా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

అందుకే ఇక్కడ షూటింగ్ ప్లాన్ చేశారు
విరాట్ కోహ్లి బిజీగా ఉండే క్రికెటర్. ఆయనతో యాడ్ ఫిల్మ్స్ చేయాలనుకునే వారు కోహ్లికి అనుకూలంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. శుక్రవారం నుండి హైదరాబాద్‌లో జరిగే టెస్ట్ మ్యాచ్ కోసం కోహ్లి ఇక్కడకు రావడంతో అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

కోహ్లి సినిమాల్లోకి అంటూ ప్రచారం
కొన్ని రోజుల క్రితం కోహ్లి సినిమాల్లోకి వస్తున్నాడంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ట్రైలర్ ది మూవీ' ఓ ఫోటో షేర్ కోహ్లి ‘పదేళ్ల తర్వాత మరో అరంగేట్రం చేస్తున్నాను.. వెయిట్ చేయలేకపోతున్నాను 'అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అదంతా కోహ్లి బ్రాండ్ ప్రమోషన్సే అని తర్వాత తేలిపోయింది.

అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను' అనే చిత్రం చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2015లో ‘అఖిల్' సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ అక్కినేని యువకెరట్ తొలిప్రయత్నం ఫెయిలైంది. గతేడాది వచ్చిన ‘హలో' సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











