కోహ్లీ ఫ్రెండ్‌షిప్ చేసే ఏకైక తెలుగు హీరో అతడే.. ఆ టైంలో వీడియో కాల్స్: తొలిసారి బయటపెట్టిన విరాట్

ఇండియాలో మూవీస్‌తో పాటు క్రికెట్‌కు మాత్రమే విపరీతమైన ఆదరణ లభిస్తోందన్న విషయం తెలిసిందే. అందుకే ఇక్కడి క్రికెటర్లు, సినిమా హీరోలను దేవుళ్లుగా కొలుస్తుంటారు. ముఖ్యంగా కొందరు ఆటగాళ్లను భారతదేశంలో విపరీతంగా అభిమానిస్తున్నారు.

అలాంటి వారిలో టాలెంటెడ్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒకడు. అసాధారణ ఆటతీరుతో లెజెండ్‌గా మారిపోయిన అతడు.. ఇప్పటికీ అదే ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా విరాట్ కోహ్లీ తనకు టాలీవుడ్‌లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసేశాడు. ఆ సంగతులను మీరే చూసేయండి!

Virat Kohli First Time Reveals About Friendship With Jr NTR

ఇండియాలో కోహ్లీ ఎమోషన్
చిన్న వయసులోనే క్రికెట్ నేర్చుకుని భారత అండర్ 19 కెప్టెన్‌గా వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్నాడు కోహ్లీ. ఆ తర్వాత భారత మెయిన్ టీమ్‌లో చోటు దక్కించుకున్న అతడు.. టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ ప్రపంచలోనే బెస్ట్ క్రికెటర్ అనిపించుకుంటున్నాడు. దీంతో కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. మొత్తంగా దేశంలోనే అతడి పేరు ఎమోషన్‌గా మారిపోయింది.

Virat Kohli First Time Reveals About Friendship With Jr NTR

ఐపీఎల్‌లో నిరాశ.. కప్ కోసం

దాదాపు పదిహేనేళ్లుగా ప్రపంచ క్రికెట్‌లో తనదైన మార్కును చూపిస్తోన్న విరాట్ కోహ్లీ.. టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. కానీ, ఐపీఎల్‌లో మాత్రం అతడి జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక్క ట్రోఫీని కూడా అందుకోలేదు. తాజా సీజన్‌లో కూడా ప్లేఆఫ్స్‌లోనే ఆర్సీబీ నిష్క్రమించింది. దీంతో ఇప్పుడు కోహ్లీ టీ20 వరల్డ్ కప్ కోసం సన్నద్దం అవుతున్నాడు.

Virat Kohli First Time Reveals About Friendship With Jr NTR

కోహ్లీకి ఇష్టమైన హీరో తారక్
ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాల్లో విరాట్ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. అందులో సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటిది విరాట్ కోహ్లీకి కూడా కొంత మంది అభిమాన సినిమా హీరోలు ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవలే అతడు మీడియాకు వెల్లడించాడు. టాలీవుడ్‌ నుంచి అతడికి ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెప్పాడు.

అతడికి ఫిదా అయిపోయా

తాజా ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. 'తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ నాకు మంచి ఫ్రెండ్. అతడి యాక్టింగ్‌ నాకు బాగా నచ్చుతుంది. గతంలో అతడితో కలిసి ఓ యాడ్ చేశాను. అప్పుడు అతడి వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయాను. తారక్ ఎంతో అప్యాయంగా మాట్లాడతాడు. అది నాకెంతగానే నచ్చేసింది. RRRలో అతడి యాక్టింగ్ గురించి మాటల్లో చెప్పలేను' అని చెప్పుకొచ్చాడు.

Virat Kohli First Time Reveals About Friendship With Jr NTR

వీడియో కాల్స్ చేస్తుంటా
విరాట్ కోహ్లీ కంటిన్యూ చేస్తూ.. 'అనుష్క‌తో క‌లిసి నాటు నాటు పాట‌కు చాలా రీల్స్ చేశాను. గ‌త ఏడాది ఓ మ్యాచ్ ఆడుతున్న స‌మ‌యంలో ఈ సాంగ్‌కు ఆస్కార్ వ‌చ్చింద‌ని తెలిసింది. వెంట‌నే గ్రౌండ్‌లోనే ఆ పాటకు డ్యాన్స్ చేసి నా సంతోషాన్ని వ్య‌క్తం చేశాను. అంతేకాదు, స్పెషల్ డేస్ ఉంటే ఎన్టీఆర్‌కు వీడియో కాల్ చేసి గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడుతుంటా' అని వివరించాడు.

ఇదంతా ఎప్పుడు అంటూ

ఇండియా వ్యాప్తంగా విరాట్ కోహ్లీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ, అతడికి నచ్చిన హీరో ఎన్టీఆర్ అని ఇప్పటి వరకూ ఎవరికీ తెలీదు. అలాంటిది ఇప్పుడు ఈ స్టార్ క్రికెటర్ ఈ విషయాలను బయటపెట్టడంతో ఇదంతా హైలైట్ అవుతోంది. ఎన్టీఆర్ - కోహ్లీ ఇంత క్లోజ్ ఫ్రెండ్సా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X