భార్య కాళ్లు పట్టుకున్న విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్!!

విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జంటకు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు క్రీడాభిమానులు.. అటు సినిమా అభిమానులు ఈ జంటను ఎంతో స్పెషల్‌గా ట్రీట్ చేస్తుంటారు. అది ఏ ఈవెంట్ అయినా సరే ఈ ఇద్దరూ కనిపించారంటే కెమెరా కళ్లన్నీ అటు వైపు చూడాల్సింది. స్మాల్ స్క్రీన్‌పై యాడ్స్‌తో ఈ ఇద్దరూ చేసే మ్యాజిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే అనుష్క శర్మ ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే.

లాక్డౌన్‌లో విశేషం..

లాక్డౌన్‌లో విశేషం..

లాక్డౌన్‌లో విరుష్క జంట ఓ శుభవార్తను తమ అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం.. వచ్చే ఏడాదిలో ముగ్గురం ఉంటామని అపురూపమైన ఫోటోను షేర్ చేశారు. దీంతో అనుష్క శర్మ తల్లి కాబోతోందని చెప్పకనే చెప్పేశారు.

ఐపీఎల్ టైంలోనూ..

ఐపీఎల్ టైంలోనూ..

ఐపీఎల్ దుబాయ్‌లో జరగ్గా.. విరాట్ తన వెంట అనుష్కను తీసుకెళ్లాడు. ఖాళీ సమయాల్లో అనుష్కను అక్కడి వీధుల్లో చుట్టి తీసుకొచ్చేవాడు. ఆ సమయంలో అనుష్క ఓ ఫోటోను షేర్ చేసింది. ఇంతకంటే నిజమైంది..ఒకరికి జీవితాన్ని ఇవ్వడమనే గొప్ప అనుభవం మరొకటి ఉండదు.. ఒకవేళ ఇది మన చేతుల్లో లేకపోతే ఎలా? అంటూ మాతృత్వపు గొప్పదనాన్ని చాటి చెప్పింది.

తాజాగా మరో ఫోటో..

తాజాగా మరో ఫోటో..

తాజాగా అనుష్క మరో ఫోటోను షేర్ చేసింది. ఇందులో అనుష్క గర్బంతో ఉన్నా కూడా శీర్షాసనం వేసింది. ఇలా యోగా చేస్తున్నాను.. అందులో నా భర్త సాయం చేస్తున్నాడంటూ అనుష్క క్యూట్ ఫోటోను షేర్ చేసింది. అందులో అనుష్క ఆసనానికి ఆమె కాళ్లు పట్టుకుని మరీ సాయం చేశాడు విరాట్.

 ఆసనం గురించి..

ఆసనం గురించి..

అయితే అనుష్క ఆ ఆసనం గురించి చెబుతూ.. చేతులు కిందికి పెట్టి.. కాళ్లు పైకి ఎత్తే అతి కష్టమైన వ్యాయామమని చెప్పింది. ఇది పాత ఫొటో అని క్లారిటీ ఇచ్చింది. యోగా తన జీవనశైలిలో ఓ భాగమైపోయింది. గర్భవతిగా ఓ స్థాయి వరకు.. గతంలో రోజూ వేసే ఆసనాలు చేయొచ్చని వైద్యులు సూచించారని తెలిపింది. సపోర్ట్‌ తీసుకుని ఇలాంటి ఆసనాలు వేయమని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చింది.

Recommended Video

Anushka Sharma Serious Recation on Her Pregnancy Rumors
నా భర్త సాయం..

నా భర్త సాయం..

శీర్షాసనాన్ని ఎన్నో ఏళ్ల నుంచి వేస్తున్నా.. గర్భవతిగా వ్యాయామం చేస్తున్నా కాబట్టి గోడను ఆధారంగా తీసుకున్నా. బ్యాలెన్స్‌ చేయడానికి, మరింత జాగ్రత్త కోసం సమర్థుడైన నా భర్త సాయం చేశాడని చెప్పుకొచ్చింది. నా యోగా శిక్షకురాలి పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా వ్యాయామాన్ని కొనసాగించడం ఎంతో సంతోషంగా ఉందని అనుష్క గాల్లో తేలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X