twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం జగన్ సీక్రెట్ లీక్ చేసిన మంచు విష్ణు: త్వరలోనే మరిన్ని విషయాలు అంటూ ఫొటో వదిలాడు!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా తన హవాను చూపిస్తున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. అయితే, ఆయన కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా సరైన హిట్లు దొరకక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నాడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు. చాలా కాలంగా విజయం కోసం అన్వేషిస్తోన్న అతడు.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో వ్యాపారం, రాజకీయాలపైనా ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక, తాజాగా ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సీక్రెట్‌ను లీక్ చేశాడు విష్ణు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

    అదొక్కటే పెద్ద సక్సెస్.. అలా వచ్చినా

    అదొక్కటే పెద్ద సక్సెస్.. అలా వచ్చినా

    కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు మంచు విష్ణు. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన 'ఢీ' అనే సినిమా మినహా ఆయనకు అంత పెద్దగా పేరు తెచ్చినవి తక్కువే. ఆ తర్వాత 'దేనికైనా రెడీ', 'దూసుకెళ్తా' వంటి ఓ మోస్తరు విజయాలను అందుకున్న అతడు.. భారీ హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఇందుకోసం జయాపజయాలతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తున్నాడు.

    ఇంగ్లీష్ సినిమాతో... చెల్లెలిగా కాజల్

    ఇంగ్లీష్ సినిమాతో... చెల్లెలిగా కాజల్

    మంచు విష్ణు హీరోగా నటిస్తూ ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తోన్న థ్రిల్లర్‌ మూవీ 'మోసగాళ్లు'. కాజల్‌ అగర్వాల్‌ ఇందులో మంచు విష్ణు సోదరి పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి జెఫ్రీ గీచిన్‌ దర్శకుడు. దీనితో పాటు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఢీ'కి సీక్వెల్ కూడా చేస్తున్నాడు మంచు విష్ణు.

    అలా కూడా నష్టపోతోన్న మంచు హీరో

    అలా కూడా నష్టపోతోన్న మంచు హీరో

    మంచు విష్ణు హీరోగా వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు. దీంతో అయినప్పటికీ విష్ణు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అదే సమయంలో 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి కొన్ని సినిమాలు నిర్మించాడు. అందులో అతడు నటించిన వాటితో పాటు మిగతా హీరోల చిత్రాలూ ఉన్నాయి. ఇవేమీ విష్ణుకు లాభాలు తెచ్చిపెట్టకపోగా నష్టాలనే మిగిల్చాయి.

    రాజకీయాలపై ఫోకస్.. టార్గెట్ చేస్తూ

    రాజకీయాలపై ఫోకస్.. టార్గెట్ చేస్తూ

    ప్రముఖ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో 'చదరంగం' అనే వెబ్ సిరీస్‌ను కొద్ది రోజుల క్రితం ప్రారంభించాడు విష్ణు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో గతంలో ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ సీనియర్ పొలిటీషియన్‌ను టార్గెట్ చేశారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ట్రైలర్ కూడా అందుకు అనుగుణంగా కనిపించింది.

    సీఎం జగన్‌ను కలిసిన మంచు విష్ణు

    సీఎం జగన్‌ను కలిసిన మంచు విష్ణు

    వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న మంచు విష్ణు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశాడు. అంతేకాదు, అక్కడ లంచ్ కూడా చేశాడు. ఇందులో జగన్ సతీమణి భారతీతో పాటు విష్ణు భార్య విరానికా కూడా పాల్గొన్నారు. ఇదిలాఉండగా, వైఎస్ ఫ్యామిలీకి మంచు వారి కుటుంబానికి బంధుత్వం ఉన్న విషయం తెలిసిందే.

    ఏపీ సీఎం సీక్రెట్ లీక్ చేసి షాకిచ్చాడు

    ఏపీ సీఎం సీక్రెట్ లీక్ చేసి షాకిచ్చాడు

    లంచ్ చేసిన తర్వాత దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మంచు విష్ణు.. 'జగన్ అన్న, భారతి అక్కను కలిశాం. లంచ్ చేశాం. విద్య పట్ల ఆయనకున్న విజన్ మరోస్థాయి. ఇంకో విషయం ఏంటంటే, ఆయనలోని హాస్య కోణాన్ని ప్రజలు మరింత తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని విషయాలు తర్వాత చెబుతా' అని పోస్ట్ చేశాడు. దీంతో జగన్ సీక్రెట్ లీకైనట్లైంది.

    English summary
    Vishnu Manchu is an Indian actor and producer known for his works in Telugu cinema and television. He had a brief stint as a child artist with the 1985 film Ragile Gundelu. Years later, he starred in the 2003 Telugu action film Vishnu, for which he won the Filmfare Best Male Debut.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X