చిన్నప్పటి నుంచి నా కోరిక అదే.. కల నెరవేరింది.. వీడియోతో బయటపెట్టిన వితిక

వరుణ్ సందేశ్ సతీమణిగా వితిక షెరు బాగానే ఫేమస్ అయింది. అయితే హీరోయిన్‌గా వితికాకు అంత ఫేమ్ రాలేదు. బిగ్ బాస్ షోలోకి వచ్చిన తరువాత వరుణ్ సందేశ్ వితికా షెరు జంట బాగా ఫేమస్ అయింది. అయితే ఈ షో వల్ల వరుణ్ సందేశ్‌కు పాజిటివ్ ఇమేజ్ రాగా.. వితికాకు కాస్త నెగెటివిటీ పెరిగింది. అక్కడి మాటలు ఇక్కడా.. ఇక్కడి మాటలు అక్కడా చెప్పడం మూలానా వితికా షెరుకు బ్యాడ్ ఇమేజ్ ఏర్పడింది.

షోలో అలా..

షోలో అలా..

బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలోనూ వితిక తన భవిష్యత్తు కార్యాచరణ గురించి ఓపెన్ అయింది. తనకు ఏదైనా ఓ షోను చేయాలని ఉందని.. హోస్ట్‌గా యాంకర్‌గా తన కెరీర్‌ను ముందుకు కొనసాగించాలన్న కోరిక ఉందని వితిక తెలిపింది.

శ్రీముఖితో పలుమార్లు..

శ్రీముఖితో పలుమార్లు..

బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో శ్రీముఖితో పలుమార్లు ఇదే విషయాన్ని చర్చించింది. తనకు యాంకరింగ్ చేయాలని ఉందనే కోరికను శ్రీముఖితో చెప్పుకునేది. అయితే మొత్తానికి వితిక షెరు తన కలను నిజం చేసుకుంది. ఓ పాటల ప్రోగ్రాంకు హోస్ట్, యాంకర్‌గా వితిక పని చేస్తోంది.

సామజవరగమన..

సామజవరగమన..

సామజవరగమన అనే ఈ షోలో వితిక యాంకరింగ్ చేస్తోంది. నోయల్ సహాకారంతో వితిక యాంకర్‌గా బాగానే రాణిస్తోంది. ఎస్పీబీ ఈ షోలో పార్టిసిపేట్ చేయడం వల్లే కరోనా సోకిందన్న సంగతి తెలిసిందే. అలా ఈ షో బాగానే పాపులర్ అయింది. అయితే ఈ షో వల్ల తన కల నేరవేరిందని వితిక చెప్పుకుంటూ ఓ వీడియోను షేర్ చేసింది.

Recommended Video

Rahul Sipligunj Special Request To KTR | నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా..!!

ఆ కోరిక..

ఓ షోను హోస్ట్ చేయాలని చిన్నతనం నుంచి నాకు ఓ కోరిక ఉండేది. సామజవరగమన అనే షోతో నా కల నెరవేరింది. సామజవరగమన అనే ఈ షోలో నా ప్రయణాం ఎలా జరిగిందో.. జరుగుతోందో మీ అందరికీ వీడియో ద్వారా చూపిస్తాను. ఈ జర్నీ నాకు ఎప్పుడు ప్రత్యేకంగానే నిలుస్తుందని చెబుతూ వీడియోను షేర్ చేసింది.

More from Filmibeat

Read more about: vithika sheru samajavaragamana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X