twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మామిడి తోటలో బిగ్‌బాస్ బ్యూటీ.. చెట్లు ఎక్కుతూ వితిక హల్చల్

    |

    బిగ్‌బాస్ ఫేమ్ వితికా షెరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై ఓ మోస్తరుగా నటించిన వితిక వరుణ్ సందేశ్‌ను పెళ్లి చేసుకుని సెటిలైంది. సినిమా ద్వారా అయిన పరిచయం.. రియల్ లైఫ్‌లో ఒక్కటిగా చేసింది. భీమిలి కబడ్డీ వంటి చిత్రాల్లో కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. అయితే వివాహానంతరం సినిమాలకు దూరంగా ఉండటంతో వెండితెరపై కనిపించక చాలా ఏళ్లే అవుతోంది. గతేడాది బిగ్‌బాస్ షోలో పాల్గొని మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చింది. బిగ్‌బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్‌ను అలా ముందుకు తీసుకెళ్లిపోతోంది వితిక.

    వరుణ్ వితికా జంటగా ఎంట్రీ ఇవ్వగా ఇద్దరూ మంచిపేరుతోనే బయటకు వచ్చారు. వితికాకు కొంచెం నెగెటివిటీ వచ్చినా.. వరుణ్ సందేశ్‌కు మాత్రం విపరీతమైన పాజిటివిటీ పెరిగింది. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ కంటే దాదాపు రెట్టింపు ఇమేజ్ వచ్చింది. ఎక్కడకు వెళ్లినా జనాలు గుమిగూడేవారు. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇలా బిగ్‌బాస్ షో వీరిద్దరికి బాగా ప్లస్ అయింది. పీవీవీఆర్ గ్రూప్ వల్ల రాహుల్, వరుణ్, వితికా, పునర్నవిలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

    Vithika Sheru Enjoying In Mango Farm

    హౌస్‌లో మాత్రం స్నేహాన్ని కొనసాగించి వదిలేయ లేదు. బయటకు వచ్చాక కూడా వీరంతా స్నేహంగానే కలిసి మెలిసి ఉంటున్నారు. రీసెంట్‌గా వరుణ్, వితిక రాహుల్ఇంట్లో సందడి చేశారు. సింగర్ నోయెల్, రాహుల్, వరుణ్, వితికా కలిసి లాక్‌డౌన్ బాగానే ఎంజాయ్ చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో తాజాగా వితిక షేర్ చేసిన ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. మామిడి తోటలో చేసిన సందడి అంతా హల్చల్ చేస్తోంది. చెట్లు ఎక్కి మరీ మామిడి కాయలను తెంపడం, చిన్న పిల్లలతో కలిసిపోవడం అంతా వైరల్ అవుతోంది. ప్రతీ చిన్న మూమెంట్ విలువైందే అంటూ తన సంతోషాన్ని వీడియో రూపంలో బయట పెట్టింది.

    English summary
    Vithika Sheru Enjoying In Mango Farm. She Says That Mango plucking 🥭a day full of love. Every little thing matters
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X