Don't Miss!
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్‌కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మామిడి తోటలో బిగ్‌బాస్ బ్యూటీ.. చెట్లు ఎక్కుతూ వితిక హల్చల్
బిగ్‌బాస్ ఫేమ్ వితికా షెరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై ఓ మోస్తరుగా నటించిన వితిక వరుణ్ సందేశ్‌ను పెళ్లి చేసుకుని సెటిలైంది. సినిమా ద్వారా అయిన పరిచయం.. రియల్ లైఫ్‌లో ఒక్కటిగా చేసింది. భీమిలి కబడ్డీ వంటి చిత్రాల్లో కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. అయితే వివాహానంతరం సినిమాలకు దూరంగా ఉండటంతో వెండితెరపై కనిపించక చాలా ఏళ్లే అవుతోంది. గతేడాది బిగ్‌బాస్ షోలో పాల్గొని మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. బిగ్‌బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్‌ను అలా ముందుకు తీసుకెళ్లిపోతోంది వితిక.
వరుణ్ వితికా జంటగా ఎంట్రీ ఇవ్వగా ఇద్దరూ మంచిపేరుతోనే బయటకు వచ్చారు. వితికాకు కొంచెం నెగెటివిటీ వచ్చినా.. వరుణ్ సందేశ్‌కు మాత్రం విపరీతమైన పాజిటివిటీ పెరిగింది. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ కంటే దాదాపు రెట్టింపు ఇమేజ్ వచ్చింది. ఎక్కడకు వెళ్లినా జనాలు గుమిగూడేవారు. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇలా బిగ్‌బాస్ షో వీరిద్దరికి బాగా ప్లస్ అయింది. పీవీవీఆర్ గ్రూప్ వల్ల రాహుల్, వరుణ్, వితికా, పునర్నవిలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
హౌస్‌లో మాత్రం స్నేహాన్ని కొనసాగించి వదిలేయ లేదు. బయటకు వచ్చాక కూడా వీరంతా స్నేహంగానే కలిసి మెలిసి ఉంటున్నారు. రీసెంట్గా వరుణ్, వితిక రాహుల్ఇంట్లో సందడి చేశారు. సింగర్ నోయెల్, రాహుల్, వరుణ్, వితికా కలిసి లాక్డౌన్ బాగానే ఎంజాయ్ చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో తాజాగా వితిక షేర్ చేసిన ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. మామిడి తోటలో చేసిన సందడి అంతా హల్చల్ చేస్తోంది. చెట్లు ఎక్కి మరీ మామిడి కాయలను తెంపడం, చిన్న పిల్లలతో కలిసిపోవడం అంతా వైరల్ అవుతోంది. ప్రతీ చిన్న మూమెంట్ విలువైందే అంటూ తన సంతోషాన్ని వీడియో రూపంలో బయట పెట్టింది.