twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం అయ్యే అవకాశం చిరుకు చేజారింది.. చివరకు అలా సర్దుకుపోయాడట.. అసలు కథ చెప్పిన వినాయక్

    |

    ఒక్కోసారి దర్శకులకు వింత అనుభవం ఎదురవుతూ ఉంటుంది. ఓ హీరో కోసం తాము ఎంతో ఇష్టపడి, కష్టపడి రాసుకున్న కథలను పక్కనపెట్టి వేరే కథలను చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తమకు ఇష్టమైన హీరో, పెద్ద హీరో అడిగినే కచ్చితంగా తలూపాల్సిందే. అలా వివి వినాయక్‌కు కూడా ఓ పరిస్థితి ఎదురైందట. తాజాగా ఆ ఘటన గురించి చెబుతూ అసలు విషయాలను బయటపెట్టాడు.

    చిరు అంటే వల్లమాలిన అభిమానం..

    చిరు అంటే వల్లమాలిన అభిమానం..

    మెగాస్టార్ చిరంజీవి అంటే వినాయక్‌కు వల్లమాలిన అభిమానం. ఈ విషయాన్ని వినాయక్ ఎన్నో సార్లు ఎన్నో ఇంటర్వ్యూల్లో బహిరంగంగానే చెప్పేశాడు. చిరును నోరారా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే వినాయక్‌కు ఓ కోరిక అలాగే మిగిలిపోయింది. ఎంతో ఇష్టపడి రాసుకున్న కథను పక్కకు పెట్టాల్సి వచ్చిందట. ఈ విషయం గురించి వినాయక్ చెబుతూ నాడు జరిగిన సంగతులను వివరించాడు.

    ఠాగూర్ కోసం..

    ఠాగూర్ కోసం..

    రాజారవీంద్ర వచ్చి నన్ను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాడు. ఫస్ట్ టైమ్ చిరంజీవిని కలవడం అదే. కాసేపు మాట్లాడిన తర్వాత రమణ సినిమా చూశారా అని అడిగారు. చూశానని చెప్పాను. నాకు బాగుంటుందా అని అడిగారు. అదిరిపోతుందని చెప్పాను అంటూ వినాయక్ నాటి విషయాలను చెప్పుకొచ్చాడు.

    అలా నా కథలోంచి..

    అలా నా కథలోంచి..

    రీమేక్ చేస్తే బాగుంటుంది.. కాకపోతే క్లైమాక్స్ మార్చాలని చెప్పాను. ఎలా మారుస్తావని అడిగారట చిరంజీవి. అప్పుడు చిరంజీవి కోసం రాసుకున్న కథలోని కొన్ని డైలాగ్‌లు, సీన్స్ చెప్పాడట. అలా తన సీఎం కథను చిరంజీవి ఠాగూర్ రీమేక్ కోసం వాడేశానని చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    ఇండస్ట్రీ లో ఆయనే నా 'గాడ్ ఫాదర్'!!
    చిరు సీఎం అయితే..

    చిరు సీఎం అయితే..

    చిరంజీవి సీఎం అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో అప్పటికే ఓ కథ రాసేసుకున్న వినాయక్.. క్లైమాక్స్ లోని కొన్ని సీన్లు, డైలాగ్స్ రమణ రీమేక్ కోసం చెప్పాడట. అది చిరంజీవికి బాగా నచ్చడం, ఆపై 4 సిట్టింగ్స్ తర్వాత ఠాగూర్ మూవీ ఓకే అయిందట. అలా చిరంజీవి కోసం రాసుకున్న ముఖ్యమంత్రి కథ, సీఎంగా చూసే ఛాన్స్ అన్నీ మిస్ అయిపోయాయి. తాను రాసుకున్న సీఎం కథను ఠాగూర్‌తోనే సర్దుకున్నాడట.

    English summary
    VV Vinayak ABout CM Story Written For Chiranjeevi In Tagore Time,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X