Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అభిమానులకు షాకివ్వబోతున్న వివి వినాయక్... గుర్తు పట్టడం కష్టమేనంట!
టాలీవుడ్లో పలు కమర్షియల్ సినిమాలు చేసి టాప్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న వివి వినాయక్ పూర్తి స్థాయి నటుడిగా అవతారం ఎత్తబోతున్న సంగతి తెలిసిందే. వినాయక్ ప్రధాన పాత్రలో త్వరలో ఓ సినిమా రాబోతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
'శరభ' మూవీ ఫేం ఎన్ నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. ఈ సినిమాలోని పాత్ర కోసం వినాయక్ భారీగా బరువు తగ్గి బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు సిద్దమయ్యారని తెలుస్తోంది.
వినాయక్ ప్రస్తుత లుక్ మీద ఇటీవల ఓ స్మాల్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని... బరువు తగ్గిన తర్వాత మిగతా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. అయితే కథ ఎలాంటి? కాన్సెప్టు ఎలా ఉండబోతోంది? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రదర్శకుల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన వివి వినాయక్... టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. కొన్ని పరాజయాల కారణంగా కొంత కాలంగా ఇండస్ట్రీలో వినాయక్ హవా తగ్గుతూ వస్తోంది దీంతో ఆయన నటన వైపు టర్న్ అయినట్లు తెలుస్తోంది.
తమిళ దర్శకుడు సుముద్రఖని... అతన అద్భుతమైన యాక్టింగ్ టాలెంటుతో పూర్తి స్థాయి నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివి వినాయక్ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడని చర్చించుకుంటున్నారు. నటుడిగా నిలదొక్కుకునే సత్తా వినాయక్‌లో ఉందా? అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
దర్శకుడిగా వినాయక్ నుంచి వచ్చిన చివరి హిట్ మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం 150'. గతేడాది సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన 'ఇంటెలిజెంట్' మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే.