నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నా: సమంత షాకింగ్ కామెంట్స్

By Manoj Kumar P

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత - నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తరచూ హాలిడే ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ గడుపుతూ హాట్ టాపిక్ అవుతోంది ఈ జంట. వ్యక్తిగత జీవితంతో పాటు సినీ కెరీర్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిపించుకుంటున్నారు. ఇటీవలే ఇద్దరూ కలిసి 'మజిలీ' అనే సినిమాతో హిట్ కొట్టారు. ఆ తర్వాత నాగ చైతన్య వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండగా.. సమంత మాత్రం '96' తెలుగు రీమేక్ మినహా మరేదాన్ని ఫైనలైజ్ చేయలేదు. దీంతో ఆమె తల్లి కావాలనుకుంటోంది అని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమ్మతనం గురించి సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, తాను తల్లి కాబోతున్నట్లు చెప్పి షాకిచ్చింది. ఇంతకీ ఈ వివరాలు ఎప్పుడు చెప్పింది..? ఎవరితో అన్నది..? పూర్తి వివరాల్లోకి వెళితే..

వరుస విజయాలతో దూకుడు

వరుస విజయాలతో దూకుడు

వరుస విజయాలతో దూకుడు మీదుంది అక్కినేని వారి కోడలు సమంత. పెళ్లికి ముందు ఎన్నో ఫ్లాపులను చూసిన ఆమె.. ఆ తర్వాత మాత్రం అస్సలు ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం'లో అద్భుతమైన నటన కనబరిచిన ఆమె.. ఆ తర్వాత ‘మహానటి', ‘యూటర్న్'లో మంచి మార్కులు కొట్టేసింది. ఇక, ఇటీవల విడుదలైన ‘ఓ బేబి'తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

 సమంత చేయాల్సింది అదొక్కటే

సమంత చేయాల్సింది అదొక్కటే

‘ఓ బేబీ' సినిమాతో మంచి ఉత్సాహంతో ఉంది సమంత అక్కినేని. నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సినిమా తర్వాత ఆమె తమిళ సినిమా ‘96' రీమేక్‌లో శర్వానంద్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. దీని తర్వాత ఆమె చేతిలో ఓ వెబ్ సిరీస్ మాత్రమే ఉంది. దీని షూటింగ్ ఒక్కటే సమంతకు మిగిలి ఉంది. ఈ సిరీస్ తర్వాత ఆమె మరో ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయలేదు.

ఆ ఫ్యామిలీతో కలవబోతుంది

ఆ ఫ్యామిలీతో కలవబోతుంది

సమంత ప్రస్తుతం ఒప్పుకున్న వాటిలో ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ మాత్రమే మిగిలి ఉంది. దీని షూటింగ్‌లో ఆమె త్వరలోనే పాల్గొనబోతుందట. సమంత ప్రాధాన పాత్రలో వస్తున్న ఈ సిరీస్‌ను తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్‌ సిరీస్‌‌ను దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ద్వయం హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో సామ్ నెగెటివ్ రోల్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.

తల్లి కావాలనుకుంటోంది

తల్లి కావాలనుకుంటోంది

సమంత త్వరలోనే తల్లి కావాలని అనుకుంటుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె సినిమాలు వద్దనుకుంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సమంతపై వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లైంది. తల్లి కావాలనుకుంటున్న సమయంలో ఫిజికల్‌గా ఎక్కువ శ్రమ పడడం ఇష్టం లేకనే సినిమాలు చేయడానికి సమంత సిద్ధంగా లేదన్న టాక్ వినిపిస్తోంది.

తల్లిని అవబోతున్నా

తల్లిని అవబోతున్నా

తాజాగా సమంతకు సోషల్ మీడియాలో నెటిజన్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. సోమవారం ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా సమంత లైవ్‌లోకి వచ్చింది. ఈ సమయంలో ఓ నెటిజన్ ‘మీ కిడ్ ఎప్పుడు రాబోతుంది' అని ప్రశ్నించాడు. దీనికి ఆమె ‘నా శరీరంలో చాలా ఆసక్తికరమైన మార్పులు వస్తున్నాయి. సో.. 2022 ఆగస్ట్‌ ఏడో తేదీన... ఉదయం ఏడు గంటలకు నేను ఓ బేబీకి జన్మనివ్వబోతున్నా' అని సమాధానం చెప్పింది.

Recommended Video

#CineBox : Sarileru Nekevvaru Teaser Update | Aamir Khan's Lal Singh Chadha First look
అయోమయంలో ఫ్యాన్స్

అయోమయంలో ఫ్యాన్స్

సమంత నెటిజన్ ప్రశ్నకు చెప్పిన సమాధానంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు సామాన్యులందరూ అయోమయానికి గురవుతున్నారు. తనపై తరచూ వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు సమంత ఈ విధంగా స్పందించిందన్న విషయం చాలా మందికి అర్థం కావడం లేదు. దీంతో ఆమె నిజంగానే తల్లి కాబోతుందని అనుకుంటున్నారు. దీంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X