రామ్‌ చరణ్ చేతికి రోల్స్ రాయిస్.. ఈ ఖరీదైన కారును కొనాలంటే?.. ఎలాంటి అర్హతలు ఉండాలంటే?

కాలం మారుతున్నట్లే.. మనిషి విలాసాలూ మారిపోతున్నాయి. ఒకప్పుడు అనవసరం అనుకున్నది ఇప్పుడు అత్యవసరమై కూర్చొంది. అలాంటి వాటిలో కారు కూడా ఒకటి. ఒకప్పుడు స్టేటస్ సింబల్‌గా భావించిన కారు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అవసరమైన వస్తువుగా మారింది. ఆఫీసులకు , వ్యక్తిగత అవసరాలకు, కుటుంబంతో సహా విహారయాత్రలకు వెళ్లేందుకు ఇప్పుడు కార్లను కొనుగోలు చేస్తున్నారు. వ్యక్తుల ఆదాయాలు కూడా పెరుగుతూ ఉండటంతో సాదాసీదా కార్లు కొనే రేంజ్ నుంచి విలాసవంతమైన కార్లను కొనుగోలు చేస్తున్నారు.

పీవీ ఆర్థిక సంస్కరణలతో
ఒకప్పుడు భారతదేశంలో కార్లంటే అంబాసిడర్, మారుతి 800. కొన్నేళ్లపాటు ఈ రెండు మోడల్స్ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఏలాయి. అప్పట్లో అవి కొన్నవారిని సంపన్నులుగా జనం భావించారు. అయితే పీవీ నరసింహారావు ప్రభుత్వం దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో ఎన్నో ఫారిన్ మోడల్స్ ఇండియాలో అడుగుపెట్టాయి. వాటితో పాటే లగ్జరీ కార్లు కూడా ఎంట్రీ ఇచ్చాయి. బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ, వోక్స్ వ్యాగన్, టయోటా, నిస్సాన్, ఫోర్డ్, ఫెరారీ, వోల్వో వంటి కార్లు మన రోడ్లపై దూసుకెళ్తున్నాయి.

What are the eligibilities to buy a rolls Royce car in india Details of Ram Charan buysRolls Royce Spectre

రాజులు, సంపన్నులకే విలాసవంతమైన కార్లు
అయితే విలాసవంతమైన కార్లలో రాజసానికి , దర్పానికి సింబల్‌గా నిలుస్తోంది రోల్సో రాయిస్. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నుంచే ఈ కంపెనీ కార్లను ఉత్పత్తి చేస్తోంది. అంతేకాదు.. రోల్స్ రాయిస్ తయారు చేసే కార్లలో దాదాపు 20 శాతం అప్పట్లోనే భారతదేశానికి ఎగుమతి అయ్యేవట. స్వాతంత్య్రానికి పూర్వం మనదేశంలో రాజులు, జమీందార్లు, సంపన్నులు రోల్స్ రాయిస్ కార్లను దిగుమతి చేసుకునేవారంటే ఈ బ్రాండ్‌పై మనవారికి ఉన్న మక్కువను అర్ధం చేసుకోవచ్చు. రాజసం ఉట్టిపడే ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే అందరూ అలా నిలబడి చూడాల్సిందే. మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్ లేటెస్ట్‌గా రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ మోడల్ 'స్పెక్టా'ను దాదాపు రూ.8 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేయడంతో మరోసారి రోల్స్ రాయిస్ చర్చనీయాంశమైంది.

రోల్స్ రాయిస్ కారు ప్రత్యేకత
దేశంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సంపన్నులు ఆడి, బెంజ్, బీఎండబ్ల్యూ, బుకాటీ, లంబోర్గిని, బెంట్లీ వంటి ఖరీదైన కార్లను వాడుతుంటారు. కానీ ఇండియాలో చాలా తక్కువ మంది వద్ద మాత్రమే రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కోట్లు వెచ్చించే సంపన్నులైన సరే రోల్స్ రాయిస్‌‌ను కొనలేరు.. కొనాలని అనుకున్నా కంపెనీ అమ్మదు. ఇందుకు రోల్స్ రాయిస్ కంపెనీ పాటించే నిబంధనలే కారణం. ఏళ్లుగా ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ బ్రాండ్‌ను కాపాడుకుంటూ వస్తోంది రోల్స్ రాయిస్.

రోల్స్ రాయిస్ కారు కొనాలంటే?
ఆ నిబంధనలు ఏంటో చూస్తే.. రోల్స్ రాయిస్ షోరూంకు వెళ్లగానే కొనే వ్యక్తిని అక్కడి కంపెనీ ప్రతినిధులు ఓ స్కోరుతో కొలుస్తారు అందులో పాసైతేనే కారును కొనే అవకాశాలుంటాయని సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతుంది. కొనుగోలు చేసే వారి ఆస్తుల వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్, పెండింగ్ లోన్స్, ఇతర రుణాల వివరాలు, చేస్తున్న వృత్తి, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వివరాలు సమర్పించాలి.

What are the eligibilities to buy a rolls Royce car in india Details of Ram Charan buysRolls Royce Spectre

రోల్స్ రాయిస్ కారు కోసం ఎలాంటి అర్హతలు ఉండాలి?
మినిమమ్ రూ.1000 కోట్ల ఆస్తి, కొనుగోలు చేస్తున్న వ్యక్తి తండ్రి వివరాలు, క్రిమినల్ బ్యాక్‌ గ్రౌండ్ , ఆ వ్యక్తి ఆంగ్ల భాషా నైపుణ్యం, మ్యూజికల్ టేస్ట్, వస్త్రధారణను గమనిస్తారట. వీటిపై సంతృప్తి చెందితేనే రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేయడానికి అనుమతిస్తారని అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఇవన్నీ పుకార్లేనని.. రోల్స్ రాయిస్ ఎప్పుడూ ఇలాంటి కండీషన్స్ పెట్టలేదని కారును కొనుగోలు చేయడానికి , భారత్‌లో డెలివరీ ఇవ్వడానికి అవసరమైన ట్యాక్స్‌లు కట్టగల సామర్ధ్యమున్న వారికి కారును విక్రయిస్తున్నారని చెబుతున్నారు.

లగ్జరీ కారు ఎవరెవరెవరి వద్దంటే?
భారత్‌లో బిలియనీర్లు, వ్యాపారవేత్తలు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు రోల్స్ రాయిస్‌ కారును వినియోగిస్తున్నారు. సినీ రంగానికి వస్తే .. హృతిక్ రోషన్, అజయ్ దేవగణ్, సంజయ్ దత్, ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, చిరంజీవి, ప్రభాస్, హన్సిక, విజయ్, శంకర్ తదితరులు ఈ లగ్జరీ కారును వాడుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ రోల్స్ రాయిస్ కారును కొనడంతో 7.5 కోట్ల విలువైన లగ్జరీ కారును మరింత మంది సెలబ్రెటీలు కూడా సొంతం చేసుకోవాలని భావిస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X