Sankranti 2024 Movies: 2023లో చిరంజీవి... మరి 2024లో బాక్సాఫీస్ విన్నర్ ఎవరంటే?

గత ఏడాది సంక్రాంతి రేసులో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డితో పాటు.. రెండు తమిళ చిత్రాలు విజయ్ వారసుడు, అజిత్ తెగింపు ఉన్నాయి. అయితే చివరకు సంక్రాంతి విన్నర్ గా నిలిచింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సారి సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామి రంగ బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి. అయితే ఈ సారి సంక్రాంతి విన్నర్ ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Recommended Video

Sankranthi 2024 Winner Guntur Kaaram Or Hanuman? లేక Naa Saami Ranga | FilmiBeat Telugu

2023లో మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఈ సారి సంక్రాంతి బరిలో మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ - ప్రశాంత్ వర్మల హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామి రంగా సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో ఉన్నాయి. ఇవి కాకుండా, కోలీవుడ్ చిత్రాలు శివకార్తికేయన్ అయాలాన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ తమిళంలో మాత్రమే రిలీజ్ అయ్యాయి.

What is the Box Office Sankranti Winner Movie in 2024?

ఇక కింగ్ నాగార్జున నటించిన 'నా సామి రంగ' ఈరోజు విడుదల అయింది. పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ చిత్రం నిన్న విడుదలై అది కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు జనవరి 12న విడుదలయ్యాయి. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నాలుగు సినిమాలు, మౌత్ టాక్ రివ్యూలు కూడా బయటకి రావడంతో ఈ సంక్రాంతి రేసులో హనుమాన్ విన్ అయినట్లు తెలుస్తోంది.

హనుమాన్ సినిమాకు ప్రీమియర్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మౌత్ టాక్ ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. దీనికి తెలుగు, హిందీ మార్కెట్లలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హనుమాన్‌తో పోలిస్తే ఇతర చిత్రాలకు తక్కువ పబ్లిక్ టాక్ వచ్చిందనే చెప్పాలి.ఇది ఈ ప్రశాంత్ వర్మ సినిమాని మరింతగా పెంచింది. హనుమన్ సూపర్ పాజిటివ్ టాక్, రివ్యూలతో దానికి మంచి ఆదరణ వస్తుంది.

What is the Box Office Sankranti Winner Movie in 2024?

ఇక గుంటూరు కారం సినిమాకు బ్యాడ్ రివ్యూలు, నెగిటివ్ మౌత్ టాక్ తో ఆ సినిమాకు మైనస్ గా మారింది. ఇక సైంధవ్ కూడా అదే టాక్ ను ఎదుర్కొంటుంది. అయితే నా సామి రంగ మంచి వన్-టైమ్ మూవీగా టాక్ సొంతం చేసుకుంది. కంటెంట్ వారీగా హనుమాన్ ఏకగ్రీవంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అంతే విధంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.

ఇక సైంధవ్ కూడా బాక్సాఫీస్ వద్ద చతికలపడిందనే చెప్పాలి. ప్రస్తుతం మహేశ్ చరిష్మాతో గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద నిలబడుతుంది. అయితే నా సామి రంగా కూడా పాజిటివ్ టాక్ రావడంతో పర్వాలేదనిపించుకుంటుంది. మరోవైపు, పండుగ తర్వాత కూడా హనుమాన్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఇక ఈ సారి సంక్రాంతి విన్నర్ తేజ సజ్జా ప్రశాంత్ వర్మ హనుమాన్ నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X