twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛీ ఆడపిల్ల పుట్టిందని బాధపడ్డారట!.. పాయల్ ఘోష్ ఎమోషనల్ ట్వీట్

    |

    ప్రయాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ ఘోష్. ఆపై రెండు మూడు చిత్రాలు చేసి బాలీవుడ్‌కు చెక్కేసింది. అయితే పాయల్‌కు సినిమాల ద్వారా కంటే వివాదాలతోనే ఎక్కువగా క్రేజ్ వచ్చింది. ఆ మధ్య మీరా చోప్రా-ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య జరిగిన వివాదంతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఆపై సోషల్ మీడియాలో పాయల్ విపరీతంగా వైరల్ అయింది. తన ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేయడం, తెలుగు హీరోలపై ప్రశంసలు కురిపించడంతో మరింతగా ఫేమస్ అయింది.

    ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు మద్దతుగా..

    ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు మద్దతుగా..

    ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రా వివాదం ఓ రేంజ్‌లో జరుగుతుండగా పాయల్ కామెంట్స్ మరింతగా వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్‌ మహిళలను ఎంతో గౌరవిస్తాడని చెప్పుకొచ్చింది. అలా పాయల్ చేసిన కామెంట్స్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెను నెత్తిన పెట్టుకున్నారు.

    ఫుల్ యాక్టివ్..

    ఫుల్ యాక్టివ్..

    అప్పటి నుంచి పాయల్ ఘోష్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. తన ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేయడం, లైవ్‌లోకి వచ్చి నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, అవి కాస్తా వైరల్ కావడంతో పాయల్ నిత్యం వార్తల్లో ఉండేది. సుశాంత్ మరణం, నెపోటిజం, బాలీవుడ్ మాఫియా, టాలీవుడ్ గొప్పదనం చెబుతూ.. పాయల్ చేసిన ట్వీట్స్ తెగ వైరల్ అయ్యాయి.

    తొలి రోజులను గుర్తు చేసుకుంటూ...

    తొలి రోజులను గుర్తు చేసుకుంటూ...

    పాయల్.. ప్రయాణం సినిమా మొదటి రోజు షూటింగ్ విశేషాలను తాజాగా పంచుకుంది. ఈ మేరకు మొదటి రోజు షూటింగ్ రమ్మన్నారు.. నడుచుకుంటూ రమ్మన్నారని అలా మొదటి షాట్ తీశారని తెలిపింది. అయితే ఆ రోజు మొత్తం మరే షాట్ కూడా తీయలేదని తెలిపింది. అయితే మొదటి షాట్ హీరోయిన్లపై తీయడం ఆనవాయితీ అనేది అప్పుడు తెలిసిందని చెప్పుకొచ్చింది. షూటింగ్ వాతావరణం ఎలా ఉంటుందని పరిచయం చేయడానికి తనను మొదటి రోజు పిలిచారని తర్వాత తెలిసినట్టు వెల్లడించింది.

    Recommended Video

    Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
    ఆడపిల్ల అని బాధపడ్డారు..

    ఆడపిల్ల అని బాధపడ్డారు..

    ఈ మేరకు పాయల్ ఘోష్ స్పందిస్తూ.. నా మొదటి చిత్రం రిలీజ్ అయినప్పుడు నాకు ఇరవై యేళ్లు. నో గాడ్ ఫాదర్, ఫిల్మ్ ఇండస్ట్రీలో నో ఫ్రెండ్స్, తండ్రి లేడు.. నో షుగర్ డాడీ. కేవలం అదృష్ణం. అయితే నేను ఎప్పుడైతే జన్మించానో.. ఓ ఆడపిల్ల పుట్టిందని మా నానమ్మ బాధపడింది. ఆమె వైపు చూడండి.. ఇందిరా గాంధీ అవుతుందని ఆ డాక్టర్ చెప్పాడు. ఆ గ్రేస్‌తో నిత్యం నేను బతుకుతున్నా'నని చెప్పుకొచ్చింది.

    English summary
    When Payal Ghosh Is Born family Members Were disappointed. whn I was born my nani ws disappointed saying a girl childz born,d doc sd look at her,Betinahi INDIRA GANDHI paida hui hai!I live my life wd al dt grace
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X