For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చందమామను పట్టేసి జాక్ పాట్ కొట్టేశాడు.. కాజల్ అగర్వాల్‌ను కట్టుకోబోయే వాడి వివరాలివే

    |

    అందాల చందమామ కాజల్ అగర్వాల్‌కు పెళ్లి ఘడియలు వచ్చేశాయ్. నిన్న అంతా కాజల్ పెళ్లి వార్తలు వైరల్ కాగా నేడు కాజల్ ఓ క్లారిటీ ఇచ్చింది. మామూలుగా అయితే నిన్న సాయంత్రమే ఓ హింట్ ఇచ్చేసింది, నిన్న ఉదయం నుంచి వార్తలు వైరల్ కావడంతో సాయంత్రం ఓ లవ్ సింబల్‌ను షేర్ చేసింది. దీంతో కాజల్ పెళ్లి అనే వార్తల్లో నిజం ఉందని ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా కాజల్ తనకు కాబోయే భర్త ఎవరు? పెళ్లి ఎప్పుడు అనే వివరాలను అధికారికంగా ప్రకటించింది.

    గౌతమ్ కిచ్లూ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోతన్నట్టు కాజల్ ప్రకటించింది. ఈ ఇద్దరికి లవ్ అండ్ అరెంజ్డ్ మ్యారెజ్ అని తెలుస్తోంది. ఇక అందాల చందమామను సొంతం చేసుకున్న వారెవరో అంటూ అప్పుడే గూగుల్‌లో వెతుకులాటలు ప్రారంభించేవారు. గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ఖాతాలను కూడా ఫాలో అవుతున్నారు. అతని డేటా అంతా లాగుతున్నారు.

    who is gautam kitchlu? know everything about kajal aggarwals husband

    ఈ క్రమంలో గౌతమ్ కిచ్లూ గురించి కొన్ని విషయాలు తెలిశాయి. గౌతమ్ కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ లో చదువుకున్నారట. తర్వాత టఫ్ట్స్ యూనివర్సిటీలో ఆ తర్వాత ఇన్ సీడ్ లో చదువుకున్నారట. గౌతమ్ డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోకి ఫౌండర్ అట. డిసెర్న్ లివింగ్ మొదలు పెట్టక ముందు, ఫ్యాబ్ ఫర్నిష్ కి వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే లైఫ్ స్టైల్ బ్రాండ్ - ద ఎలిఫెంట్ కంపెనీ కి సీఈఓ గా ఉన్నారట. మొత్తానికి గౌతమ్ కిచ్లూ మాత్రం రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు.

    English summary
    kajal aggarwal nounce About Her Marraige, SHe is Going Marry gautam kitchlu On 30th October.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X