Highest Paid Indian Actor ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత? షారుక్ పారితోషికం ఎంత? నువ్వా? నేనా? అనే పోటీలో హీరోలు!

సినీ పరిశ్రమలో ఒకప్పుడు బాలీవుడ్ హీరోలదే అధిపత్యం కొనసాగేది. బాహుబలి సినిమా తర్వాత తెలుగు పరిశ్రమ అన్ని భాషల ఇండస్ట్రీలపై పైచేయి సాధించింది. టాలీవుడ్ హీరోలపై అన్ని పరిశ్రమల చూపు పడింది. దాంతో సినిమాల బడ్జెట్, రెమ్యునరేషన్ల విషయంలో హీరోల మధ్య పోటీ పెరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఎవరు ఎక్కువగా రెమ్యునరేషన్లు తీసుకొంటున్నారనే విషయం ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్, షారుక్ ఖాన్ మధ్య భారీ పోటీ నెలకొన్నది. వారి రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..

బాహుబలి తర్వాత ప్రభాస్..: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి బాహుబలి వరకు నార్త్‌లో పెద్దగా క్రేజ్ కనిపించలేదు. కానీ బాహుబలి 2 పార్టులు వచ్చిన తర్వాత ఆయనకు ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో చిత్రం పెద్దగా ఆడకపోయినా.. ఆయన స్టార్ డమ్‌కు చెక్కు చెదరలేదు. దాంతో ప్రభాస్‌తో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కట్టారు.

Highest Paid Indian Actor

ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతంటే? : ప్రభాస్ విషయానికి వస్తే.. బాహుబలి తర్వాత అమాంతం రెమ్యునరేషన్ పెరిగిపోయింది. ఎవరూ ఊహించని విధంగా ప్రభాస్‌కు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఏకంగా ప్రభాస్‌కు 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చి తమ సినిమాల్లో యాక్టింగ్ చేయించుకొనేందుకు ఆదిపురుష్ యూనిట్ సిద్దమైంది. దాంతో ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోగా ప్రభాస్ పేరు మార్మోగిపోయింది.

Highest Paid Indian Actor

హిందీలో ఫ్లాపులతో ఖాన్ త్రయం : ఇక బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ స్టార్ హీరోలుగా అత్యధికంగా పారితోషికం తీసుకొనే వారు. అయితే ఈ ఖాన్ త్రయంకు ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టాయి. ఈ ముగ్గురు హీరోలకు వరుస ఫ్లాపులు రావడంతో వారి స్టార్‌డమ్‌కు బీటలు బారిందనే చెప్పాలి. ప్రస్తుతం భారీ హిట్‌తో షారుక్ ఖాన్ మళ్లీ స్టార్ డమ్‌ను చేజిక్కించుకొన్నట్టు కనిపిస్తున్నది.

పఠాన్ సక్సెస్ తర్వాత షారుక్‌కు ఎంతంటే? : పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళ్లింది. దాంతో షారుక్ ఖాన్ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసింది. దాదాపు 1050 కోట్ల వసూళ్లు సాధించింది. దాంతో ఈ సినిమాలో నటించినందుకు షారుక్ లాభాల్లో షేర్ తీసుకొన్నాడని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా లాభాల్లో నుంచి తన పారితోషికం వాటాగా సుమారు 200 కోట్లు అందుకొన్నాడనే విషయం ట్రెండ్ అవుతున్నది.

Highest Paid Indian Actor

దక్షిణాదిలో టాప్ హీరోల పారితోషికం గురించి : ఇక దక్షిణాలో ఇతర స్టార్ హీరోల రెమ్యునరేషన్ విషయంలోకి వెళితే.. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, దళపతి విజయ్, రాంచరణ్, ఎన్టీఆర్‌, అజిత్ లాంటి హీరోలు టాప్ రెమ్యునరేషన్స్ అందుకొనే వారిలో ఉన్నారు. విజయ్ దాదాపు 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక పవన్, మహేష్, రాంచరణ్, ఎన్టీఆర్ దాదాపు 50 నుంచి 70 కోట్ల వరకు పారితోషికం తీసుకొంటున్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X