Who is Rama Raju Mantena? మంతెన వారి పెళ్లికి జెన్నిఫర్, బీబర్, బాలీవుడ్ ప్రముఖులు.. ఎవరీ రామరాజు మంతేన?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సంఘటన మది నుంచి చెరిగిపోకముందే.. మరో గ్రాండ్ మ్యారేజ్ సెలబ్రేషన్‌కు భారత్ సాక్ష్యంగా నిలువనున్నది. ప్రవాసాంధ్రుడు ఇంట్లో జరిగే వివాహ కార్యక్రమానికి హాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు హాజరుకానున్నారు. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిన ఈ మ్యారేజ్ సెలబ్రేషన్స్‌ను మంతెన కుటుంబం నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకు ఈ పెళ్లిని అత్యంత ఆర్బాటంగా, అందరూ ఔరా అని ముక్కున వేలేసుకొనే విధంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం గురించి, ఆయన ఇంట్లో జరిగే పెళ్లికి ఎవరెవరూ వస్తున్నారనే వివరాల్లోకి వెళితే..
ముఖేష్ అంబానీ ఫ్యామిలీలో జరిగిన పెళ్లి వేడుకల తర్వాత ఈ సంవత్సరపు అత్యంత విలాసంతమైన పెళ్లి వేడుక ప్రస్తుతం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్నది. అమెరికాలో ఫార్మా కింగ్‌గా పేర్కొనే రామరాజు మంతెన ఇంట్లో ఈ పెళ్లి జరగడం విశేషంగా మారింది. రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన వివాహం మరో వ్యాపార దిగ్గజం వంశీ గాడిరాజుతో జరుగుతున్నది. ఈ పెళ్లి వేడుకలు మూడు రోజులపాటు అట్టహాసంగా అంటే నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు జరుగనున్నది.

ఇప్పటికే ఈ వివాహ మహోత్సవానికి ఉదయపూర్‌లోని అనేక హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు ముస్తాబయ్యాయి. ఆ ప్రాంతంలోని ప్రముఖంగా చెప్పుకొనే ది లీలా ప్యాలేస్, జెనాన మహల్, లేక్ పిచోలా ప్రాంతాలను అందంగా అలకరించారు. రాజస్థానీ సంప్రదాయాలతో జరిగే ఈ వివాహ వేడుకకు అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులు హాజరుకాన్నారు. దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరు అవుతున్న నేపథ్యంలో ఉదయ్‌పూర్‌లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
అత్యంత ఆర్బాటంగా జరుగుతున్న ఈ పెళ్లి కోసం ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఉదయ్‌పూర్‌కు చేరుకొన్నారు. ఈ వివాహంలో పాప్ దిగ్గజాలు జెన్నిఫర్ లోపేజ్, జస్టిన్ బీబర్ కూడా హాజరుకానున్నారు. ఇంకా బాలీవుడ్ ప్రముఖుల్లో జాన్వీ కపూర్, కరణ్ జోహర్, రణ్‌వీర్ సింగ్, హృతిక్ రోషన్, నోరా ఫతేహి, జాక్వలైన్ ఫెర్నాండేజ్, దియా మిర్జా, మాధురి దీక్షిత్ తదితరులు హాజరు అవుతున్నారు.
ఇక రామరాజు మంతెన వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ గురించిన వివరాల్లోకి వెళితే.. ఆయన జేఎన్‌టీయూ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ సాధించారు. ఆ తర్వాత మేరిలాండ్ యూనివర్సిటీ నుంచి క్లినికల్ ఫార్మసీలో డిగ్రీ పొందారు. అనంతరం అమెరికా, స్విట్జర్జాండ్, ఇండియాలో ఇన్‌జీనస్ అనే పేరుతో ఫార్మాసూటికల్ కంపెనీని నిర్వహిస్తున్నారు. అమెరికాలోని హెల్త్ కేర్ ఇండస్ట్రీలో టాప్ స్థానంలో ఉన్నారు. ఐ కోర్ అనే హెల్త్ కేర్ సంస్థను స్థాపించాడు. ఆయన నికర ఆస్తుల విలువ 167 కోట్ల రూపాయలు అని అంచనా వేశారు.


Click it and Unblock the Notifications











