CCL 2024 Final కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్ నువ్వా? నేనా? సీసీఎల్ 2024 గెలుపు ఎవ్వరిది?
గత నెల రోజులుగా ఉత్కంఠ, నరాలు తెగే అనుభూతితో క్రికెట్, సినీ అభిమానులకు వినోదాన్ని పంచిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 (CCL 2024) తుది అంకానికి చేరుకొన్నది. సీసీఎల్ 10వ సీజన్ టైటిల్ కోసం కిచ్చ సుదీప్ నేతృత్వంలోని కర్నాటక బుల్బోజర్స్, జిషూ సేన్ గుప్తా నాయకత్వంలోని బెంగాల్ టైగర్స్ జట్లు టైటిల్ కోసం సిద్దమయ్య్యాయి. ఆదివారం అంటే.. మార్చి 17వ తేదీన కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో ఎవరు విజేతగా నిలుస్తారనే ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఈ ఫైనల్ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..
టైటిల్ ఫేవరేట్‌గా దిగిన తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ క్వాలిఫయర్ రౌండ్‌కు ముందే నిష్క్రమించాయి. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోను అద్బుతంగా రాణించిన తెలుగు జట్టును దురదృష్టం వెంటాడింది. మార్చి 2వ తేదీన కేరళతో జరిగిన మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో ఓటమి చెందడం తెలుగు వారియర్స్ జట్టు రాతను మార్చేసింది.

క్వాలిఫయర్ రౌండ్ కోసం రేన్ రేట్ విషయంలో తెలుగు వారియర్ జట్టు వెనుకపడి.. అవకాశాలను చేజార్చుకొన్నది. ముంబై జట్టు 0.462 రన్ రేట్‌తో ఉండగా.. తెలుగు వారియర్ జట్టు 0.456 రన్ రేట్ నమోదు చేసుకొన్నది. దాంతో అత్యంత స్వల్ప తేడాతో.క్వాలిఫయర్ రౌండ్‌లోకి వెళ్లే తెలుగు టీమ్ అవకాశం మిస్ చేసుకొన్నది.

ఇక ఎలిమినేటర్ మ్యాచ్ మార్చి 15వ తేదీన చెన్నై రైనోస్, ముంబై హీరోస్ జట్ల మధ్య జరిగింది. పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్ చెన్నై రైనోస్ జట్టు పేలవమైన ఆటను ప్రదర్శించింది. దాంతో ముంబై హీరోస్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలా క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు అర్హత సాధించింది.
ఇక బెంగాల్ టైగర్స్ జట్టు పోరాట పటిమను మరోసారి చూపించుకొన్నది. క్వాలిఫయర్ మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌తో మార్చి 15వ తేదీన జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ జట్టు ఓటమిపాలైంది. అయితే ఫైనల్‌కు చేరాలంటే.. క్వాలిఫయర్ రెండో మ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది. దాంతో జట్టు కలిసి కట్టుగా ఆడి ముంబై హీరోస్ జట్టును 10 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ రేసుకు సిద్దమైంది.

ఇక తుది సమరానికి కర్ణాటక, బెంగాల్ జట్లు సిద్దమయ్యాయి. త్రివేండ్రంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో నువ్వా? నేనా అనే విధంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. క్వాలిఫయర్ రౌండ్‌లో ఓటమికి బెంగాల్ ప్రతీకారం తీర్చుకొంటుందా? మరోసారి బెంగాల్‌ను కర్ణాటక జట్టు ఓడించి సీసీఎల్ కప్ ఎగురేసుకుపోతుందా? అనేది సినీ, క్రికెట్ అభిమానులకు ఆసక్తిగా మారింది.
ఇక కిచ్చ సుదీప్, జిషు సేన్‌గుప్తా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మార్చి 17వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను జీ సినిమా ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. సినీ, క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను ఓటీటీలో వీక్షించడానికి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











