లెజెండరీ క్రికెటర్‌తో గ్రేట్ సింగర్ లవ్ అఫైర్.. పెద్దలు నో చెబితే జీవితాంతం బ్రహ్మచారులుగానే.. వారెవరో తెలుసా
ప్రపంచంలో కొన్ని ప్రేమలు సంతోషకరంగా, మరికొన్ని లవ్ స్టోరీలు విషాదంగా ముగిసిపోతుంటాయి. ప్రేమలో ఉన్నంత కాలం ఒకరిని విడిచి మరొకరం ఉండలేననే వాళ్లు.. బ్రేకప్ తర్వాత పెళ్లి చేసుకొని కాపురం చేసుకొంటూ జీవించిన వాళ్లు కోకొల్లలు. కానీ ప్రేమ కోసమే జీవించి.. ప్రేమనే జీవితంగా మార్చుకొని.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో జీవితాంతం బ్రహ్మాచారులుగా మిగిలిపోయిన ఇద్దరు భారతీయ దిగ్గజాల భావోద్వేగమైన కథలోకి వెళితే..
క్రికెటర్ల జీవితాల్లోకి సినీ తారలు రావడం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అప్పట్లో టైగర్ పటౌడీ, సినీ తార షర్మిలా ఠాగూర్ లవ్ స్టోరి గురించి యువతరానికి తెలియకపోవచ్చు. కానీ వారి ప్రేమ అందరికి ఆదర్శంగా నిలిచింది. అలాగే నేటితరంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లవ్, మ్యారేజ్ గురించి అందరికి తెలిసిందే. అయితే 50, 60 దశకంలో సినీ దిగ్గజం, క్రికెట్ లెజెండ్ ప్రేమ వ్యవహారం అందరికి తెలిసిందే. వారే సింగర్ లతా మంగేష్కర్, క్రికెటర్ రాజ్‌సింగ్ దుంగార్పూర్.

రాజ వంశానికి చెందిన రాజ్ సింగ్ దుంగర్పూర్ గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు. ప్రముఖ లాయర్ కూడా. మధ్య ప్రదేశ్‌లోని రాజ్‌పుతానాకు చెందిన దుంగార్బూర్ రాజవంశంలోని మహారావాల్ లక్ష్మణ్ సింగ్‌జీ కుమారుడే రాజ్ సింగ్. న్యాయశాస్త్రం చదువుతూనే రంజీ క్రికెట్ ఆడటం కోసం రాజ్ సింగ్ ముంబై వెళ్లాడు. తన స్నేహితుడైన హృదయానాథ్ మంగేష్కర్‌ను కలుసే వాడు. ఆ సమయంలో తన సోదరి లతా మంగేష్కర్‌ను హృదయనాథ్ పరిచయం చేశాడు.
తొలిచూపు, పరిచయంలోనే లతా మంగేష్కర్, రాజ్ సింగ్ దుంగార్పూర్ ప్రేమలో పడ్డారు. వారిద్దరిని విడదీయలేనంతగా వారి ప్రేమ వ్యవహారం సాగింది. పీకల్లోతూ ప్రేమలో మునిగిన లతా, రాజ్ పెళ్లి చేసుకొన్నారు. కానీ వారి ప్రేమకు రాజ్ సింగ్ ఫ్యామిలీ అభ్యంతరం తెలిపారు. ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి, అదీ సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తిని రాజ వంశంలోకి ఎలా అనుమతించాలని పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో వారి ప్రేమకు ఎండ్ కార్డు పడింది.
అయితే లతా మంగేష్కర్ తప్ప తన మనసులో మరొకరికి చోటు ఇవ్వకూడదని రాజ్ సింగ్ దుంగార్పూర్ నిర్ణయించుకొన్నారు. అలాగే లతా మంగేష్కర్ కూడా ఒంటరిగానే మిగిలిపోయారు. వారు జీవితంలో పెళ్లి చేసుకొకుండా బ్రహ్మచారులగానే మిగిలిపోయారు. వారిద్దరూ పెళ్లి చేసుకోకపోయినా రొమాంటిక్ పార్ట్‌నర్స్‌గా జీవితాన్ని కొనసాగించారు. అద్వితీయమైన ప్రేమకు వారిద్దరు చిహ్నంగా మిగిలారు.

అయితే కుటుంబ అభ్యంతరాల మధ్య రాజ్ సింగ్ దుంగర్పూర్, లతా మంగేష్కర్ లవ్ ట్రాక్ నిరంతరంగా సాగింది. వారిద్దరి రొమాంటిక్ లైఫ్ గురించి అనేక కథనాలు వచ్చాయి. ఆయన తన జీవితంలో క్రికెట్‌లో ఎన్నో ఘనతలు సాధించి.. బీసీసీఐ అధ్యక్షుడు అయ్యాడు. ఇండియా మ్యాచ్ జరిగే ప్రతీసారి లతా మంగేష్కర్ కోసం ఓ టికెట్ పంపించేవారు అని వారి సన్నిహితులు చెప్పుకొంటారు.
ఇదిలా ఉండగా, రాజ్ సింగ్ దుంగర్పూర్ తన 74వ ఏట సెప్టెంబర్ 12వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆల్జీమర్స్ వ్యాధితో చాలాకాలం బాధపడుతూ ఆయన మరణించారు. ఆయన అంత్యక్రియలు దుంగర్పూర్‌లో జరిగాయి. లతా మంగేష్కర్ విషయానికి వస్తే.. ఆమె తన 92వ ఏట కోవిడ్ వ్యాధితో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు.


Click it and Unblock the Notifications











