CCL 2025: గత విజేత బెంగాల్ టైగర్స్ విజృంభిస్తారా? జిషు సేన్ గుప్తా టీమ్ మ్యాజిక్ చేస్తుందా?
భారతీయ సినిమా రంగాలకు చెందిన సినీ తారల క్రికెట్ పోటీలు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అలియాస్ ది ఛాంపియన్ క్రికెట్ లీగ్ ప్రారంభానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన మొదలయ్యే ఈ పోటీలకు అన్ని భాషలకు చెందిన సినీ తారల జట్లు సర్వం సిద్దమవుతున్నాయి. ఈ పోటీలు ప్రారంభానికి ముందు అందరిని ఒకటే ప్రశ్న వెంటాడుతున్నది. ఆ ప్రశ్న ఏమిటనే వివరాల్లోకి వెళితే..
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 10వ సీజన్‌లో కెప్టెన్ జిషు సేన్ గుప్తా నేతృత్వంలోని బెంగాల్ టైగర్స్ జట్టు ర్యాంకింగ్ పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. అయితే బెంగాల్ టీమ్ విజయావకాశాలపై ఎలాంటి అంచనాలు లేవు. తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, చెన్నై రైనోస్, ముంబై హీరోస్ జట్ల ముందు పసికూనల కనిపించింది. అయితే తాము పసికూనలం కాదని..ఒక్కో మ్యాచ్ గెలుచుకొంటూ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్‌లో భారీ జట్లను మట్టికరించింది.

ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. బలమైన కర్ణాటక బుల్డోజర్స్ జట్టుపై గెలవడం కష్టమే అందరూ అనుకొన్నారు. అందుకు తగినట్టే కర్ణాటక జట్టు ధాటిగా ఆడింది. అయితే చివర్లో గెలుపు వాకిట కర్ణాటక జట్టు బోల్తా పడటంతో విజయం బెంగాల్ టైగర్స్‌ను వరించింది.
సీసీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ అంటే.. ఫైనల్ మ్యాచ్‌న మంచి ప్రేక్షకులకు అనుభూతిని పంచింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగాల్ జట్టు నిర్ణీత ఓవర్లలో 137 పరుగులు చేసింది. దాంతో కర్ణాటక ముందు 138 పరుగుల లక్ష్యాన్ని టైగర్స్ పెట్టారు. అయితే కర్ణాటక జట్టు బ్యాటింగ్ ధాటిగా ప్రారంభించడంతో అందరూ ఆ జట్టు విజయం సులభమే అని అనుకొన్నారు. కానీ బెంగాల్ జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్, ఫీల్డింగ్ చేయడంతో చివరి ఓవర్లలో విజయం వారి వైపు మొగ్గు చూపింది.
కర్ణాటక జట్టులో విజయానికి కావాల్సిన పరుగులు సాధించడానికి జట్టు ఆటగాడు కరణ్ సుడిగాలి ఇన్సింగ్స్ ఆడాడు. కార్తీక్, ప్రతాప్ కూడా భారీగా స్కోర్లు చేశారు. కార్తీక్ అవుటయ్యాక వచ్చిన రాజీవ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. దాంతో కర్ణాటక జట్టు విజయం తథ్యమని అనిపించింది. అయితే భారీ షాట్‌కు ప్రయత్నించిన ఆయన అవుట్ కావడం.. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు వెంటవెంటనే అవుట్ అవ్వడంతో విజయం బెంగాల్‌ను వరించింది.
గత సీజన్ విజేతగా బెంగాల్ టైగర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జిషు సేన్ గుప్తా టీమ్ మరోసారి అద్బుతమైన ప్రతిభతో మ్యాజిక్ చేస్తుందా? ఈసారి దిగ్గజ జట్లను ఓడించి మళ్లీ కప్ సాధిస్తుందా? అనే విషయంపై క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే బెంగాల్ ఏ మేరకు మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











