CCL 2024 Final: బెంగాల్ టైగర్స్ జట్టు గెలుస్తుందా? జిషు సేన్‌గుప్తా టీమ్ బలమేమిటి? బలహీనతలేంటంటే?

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 టోర్నమెంట్‌లో దేశంలోని సినీ తారలతో కూడిన దిగ్గజ జట్లను సునాయసంగా ఓడించి బెంగాల్ టైగర్స్ జట్టు ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ.. క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబైపై ఘన విజయం సాధించింది. ప్రముఖ నటుడు జిషు సేన్ గుప్తా నాయకత్వంలో ఫైనల్‌కు చేరిన బెంగాల్ జట్టు ఎలా ఫైనల్‌కు చేరింది. ఆ జట్టు బలబలాలు ఏమిటనే విషయంలోకి వెళితే..

* బెంగాల్ టైగర్స్ జట్టు తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 24వ తేదీన కేరళ స్ట్రైకర్స్‌తో ఆడింది. అంతర్జాతీయ వేదిక షార్జాలో జరిగిన ఆ మ్యాచ్‌లో కేరళ జట్టుపై అధిపత్యం చూపించి సుమారుగా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Will Bengal Tigers Team win in CCL 2024 Final against Karnataka Bulldozers

* తొలి మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకొన్న జట్టు అదే జోష్‌తో హైదరాబాద్‌లో జరిగిన రెండో మ్యాచ్‌ కోసం బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక జట్టును 30 పరుగుల తేడాతో గెలుపు సాధించింది.

* చండీగడ్‌లోని మొహాలీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లో స్టార్ యాక్టర్ సోను సూద్‌ నేతృత్వంలోని పంజాబ్ దే షేర్ జట్టును ఎదుర్కొన్నది. ఈ మ్యాచ్‌లోను పంజాబ్‌పై 26 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

* ఇక మొహాలీలోనే జరిగిన నాలుగో మ్యాచ్‌లో కూడా బెంగాల్ టైగర్స్ జట్టు సత్తా చాటింది. భోజ్‌పురి జట్టుతో జరిగిన ఆటలో అన్ని విభాగాల్లో పై చేయి సాధించింది. దాంతో 71 పరుగుల భారీ విజయాన్ని బెంగాల్ టైగర్స్ అందుకొన్నది.

* ఇక క్వాలిఫయర్ 1 మ్యాచ్‌‌లో కర్ణాటక బుల్డోజర్స్ జట్టుతో నువ్వా? నేనా అనే విధంగా పోటీ పడింది. కానీ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ లైనప్ ఫెయిల్ కావడంతో కర్ణాటక జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో క్వాలిఫయర్ మ్యాచ్ ముంబై హీరోస్‌తో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరువనంతపురంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై హీరోస్ జట్టుపై 10 పరుగులు తేడాతో విజయం సాధించడమే కాకుండా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

* బెంగాల్ టైగర్స్ జట్టు విషయానికి వస్తే.. బౌలింగ్, ఫీల్డింగ్ బలంగా ఉండగా.. అస్థిరత్వంతో కూడా బ్యాటింగ్ లైనప్ జట్టును వేధిస్తున్నది. ఈ జట్టు బ్యాటింగ్ పరంగా రాణించగలిగితే.. సీసీఎల్ 2024 ఫైనల్‌లో విజయం సాధించడం ఖాయమని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X