ప్రభాస్ కోసం దిగ్గజ సంస్థల వేట.. ఇండియన్ సినిమా ఫిల్మ్ మేకింగ్‌‌ తీరును మార్చబోతున్న సాహో!

బాహుబలి తర్వాత ప్రపంచ సినిమా పటంపై భారతీయ సినిమా ముఖచిత్రం అద్భుతంగా మారిపోయింది. ఈ చిత్రంతో ప్రపంచ సినిమాకు ఇండియన్ సినిమా దిక్సూచిగా మారిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బాహుబలి1, బాహుబలి2 చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై ప్రపంచ సినిమా దృష్టి పడింది. ప్రస్తుతం భారతీయ సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పలు అంతర్జాతీయ సంస్థలు భారీ అడుగులు వేస్తున్నాయి. బాహుబలి తర్వాత తాజాగా అదే పరిస్థితిని సాహో సినిమా క్రియేట్ చేస్తున్నది.. వివరాల్లోకి వెళితే..

బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్

బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్

బాహుబలి తర్వాత రెబల్‌స్టార్ ప్రభాస్ జాతీయ స్థాయి స్టార్‌గా మారియపోయాడు. దేశమంతటా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సాహో మూవీకి సంబంధించిన వీడియోలకు అనూహ్యమైన రెస్పాన్స్ లభించడంతో ఇప్పుడు దృష్టంతా యంగ్ రెబల్ స్టార్‌పై పడింది. దాంతో బాలీవుడ్ హీరోలకు దక్కని అభిమానగణం ఇప్పుడు ప్రభాస్ సొంతం కాబోతున్నది.

రికార్డు స్ఠాయిలో సాహో చాప్టర్2

రికార్డు స్ఠాయిలో సాహో చాప్టర్2

గతేడాది రిలీజైన ఫస్ట్ చాప్టర్ ఆఫ్ షేడ్స్ ఆఫ్ సాహోకు మంచి స్పందన రావడం, తాజాగా విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహోకు అత్యధిక వ్యూస్ రావడంతో ప్రభాస్ స్టామినా అర్ధమైంది. షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్2కు ఏ భారతీయ సినిమాకు రాని విధంగా 12 మిలియన్ల వ్యూస్ రావడం ఓ సరికొత్త రికార్డును సృష్టించింది.

సోషల్ మీడియాలో సాహో హల్‌చల్

సోషల్ మీడియాలో సాహో హల్‌చల్

సోషల్ మీడియాలో షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్2కు 79 మిలియన్ల వ్యూస్ రాడం, మేకింగ్ వీడియోకు కేవలం 24 గంటల్లో 3 మిలియన్ల లైక్స్ రావడం ప్రభాస్ క్రేజ్‌కు అద్ధంపట్టింది. ఇలాంటి రికార్డుల నేపథ్యంతో ప్రభాస్‌పై జాతీయస్థాయిలో క్రేజ్ ఏర్పడటంతో ప్రభాస్‌తో సినిమాలు నిర్మించేందుకు అంతర్జాతీయ, జాతీయ సినీ నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి.

 హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా

హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా

సాహో చిత్రాన్ని అంతర్జాతీయ సినిమా ప్రమాణాలకు ధీటుగా దర్శకుడు సుజిత్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ సినిమా ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తెరకెక్కించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ టెక్నిషియన్స్‌ను ఎంపిక చేసుకోవడం తెలిసిందే. అనుకొన్న ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగా జరిగితే సాహో చిత్రం భారతీయ యాక్షన్ సినిమాలకు ఐకాన్‌గా మారే అవకాశం లేకపోలేదు.

 సాహో రేంజ్ ఏమిటనేది

సాహో రేంజ్ ఏమిటనేది

సాహో సినిమా రిలీజ్ తర్వాత వచ్చే ఫలితాలు, కలెక్షన్లు, సాంకేతిక పనితీరు భారతీయ సినిమా నిర్మాణానికి స్ఫూర్తి నిలువడంలో ఏ మాత్రం సందేహం లేదనే వాదన సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. భారతీయ, తెలుగు సినిమా ప్రయాణాన్ని సాహో ఏ రేంజ్‌కు తీసుకెళ్తుందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగితే సరే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X