Telugu Warriors: తెలుగు వారియర్స్ పరువు కాపాడుకొంటుందా? భోజ్‌పురి దబాంగ్స్‌ను మట్టి కరిపిస్తుందా?

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్‌లోనే కన్నడ, బెంగాల్, భోజ్‌పురి జట్లు తమ సత్తాను చాటుకొన్నాయి. భారీ స్కోరుల, ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించిన ఈ జట్లు ప్రత్యర్థి టీమ్‌లపై తమ అధిక్యాన్ని కొనసాగించాయి. అయితే నాలుగు సార్లు ఛాంపియన్ తెలుగు వారియర్స్ మాత్రం తొలి మ్యాచ్‌లో డీలా పడింది. దాంతో తెలుగు సినీ, క్రికెట్ అభిమానులు నిరాశలో మునిగారు. అయితే వచ్చే మ్యాచ్‌లోనైనా పరువు నిలుపుకొంటారా? అని ఎదురు చూస్తున్నారు. తెలుగు వారియర్స్ జట్టు గురించిన వివరాల్లోకి వెళితే..

సీసీఎల్ టోర్నీలో తెలుగు వారియర్స్ ఘనమైన చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఈ టీమ్ నాలుగు సార్లు విజేతగా నిలిచింది. వరుసగా మూడు సంవత్సరాలు కప్ కొట్టి హ్యాట్రిక్ సాధించారు. సీసీఎల్‌లో ఐదో సీజన్‌లో అంటే 2015 సంవత్సరంలో తొలిసారి విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2016లో, 2007 సంవత్సరాల్లో ఛాంపియన్‌గా ట్రోఫిని అందుకొన్నది. అలాగే 2023 సంవత్సరంలో కూడా తెలుగు వారియర్స్ విజేతగా నిలిచారు. అయితే ఈ ఏడాది కప్ కొడుతామని అఖిల్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Will Telugu Warriors win over Bhojpuri Dabanggs in CCL 2025 at Hyderabad on February 14th

అయితే ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన ఆరంభ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ జట్టు కర్ణాటక బుల్డోజర్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా అఖిల్ తప్పుడు నిర్ణయం తీసుకొన్నాడనే విమర్శలు వినిపించాయి. కానీ జట్టు మాత్రం బలమైన కర్ణాటక జట్టును బలంగా ఎదుర్కొన్నది.టాప్ బ్యాటింగ్ ఆర్డర్ విఫలం కావడంతో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

అయితే తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత రెండో మ్యాచ్‌పై తెలుగు వారియర్స్ జట్టు పూర్తిగా దృష్టిపెట్టింది. సొంత గడ్డ హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నది. ఫిబ్రవరి 14వ తేదీన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భోజ్‌పురి దబాంగ్స్ జట్టును మట్టి కరిపించేందుకు సర్వం సిద్దమవుతున్నది. ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది.

తెలుగు వారియర్స్:
ఓనర్స్: సచిన్ జోషి, వెంకటేశ్
కెప్టెన్: అఖిల్ అక్కినేని

టీమ్: సచిన్ జోషి, అశ్విన్ బాబు, సాయిధరమ్ తేజ్, ఆదర్శ్, నందకిషోర్, నిఖిల్, రఘు, సామ్రాట్, తరుణ్, విశ్వ, ప్రిన్స్, సుశాంత్, ఖయ్యూం, హరీష్

భోజ్‌పురి దబాంగ్స్
ఓనర్స్: సుశీల్ శర్మ, కనిష్క్ శీల్, రాహుల్ మిశ్రా, సుశీల్ మాలిక్
కెప్టెన్: మనోజ్ తివారీ

టీమ్: రవి కిషన్, విక్రాంత్ సింగ్, ఆదిత్య జోజా, అస్గర్ ఖాన్, అయాజ్ ఖాన్, జే యాదవ్, వికాస్ సింగ్ విరప్పన్, అజయ్ శర్మ, శైలేష్ సిన్హా, దినేష్ లాల్ యాదవ్, పర్వేశ్ లాల్ యాదవ్, ఉదయ్ తివారీ, అన్హుమాన్ సింగ్ రాజ్‌పుత్, ఖేసరి లాల్ యాదవ్, వికాస్ ఝా, బైవావ్ రాయ్, సుధీర్ సింగ్

భోజ్‌పురి దబాంగ్స్‌తో తెలుగు వారియర్స్ జట్టుతో జరిగే మ్యాచ్ సాయంత్రం 6.30 గంటల నుంచి ప్రారంభమై 10.30 గంటల వరకు కొనసాగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X