మాటల మాంత్రికుడి జన్మదినం.. అందరికంటే ప్రత్యేకం అందుకే!
Recommended Video

రచయితగా ఇండస్ట్రీకి పరిచమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ సమయంలోనే అగ్ర దర్శకుడిగా ఎదిగాడు. త్రివిక్రమ్ రాసే మాటలు వినే కొద్దీ వినాలనిపించే విధంగా ఉంటాయి. ఆయన రచన మూస శైలిలో ఉండదు. దర్శత్వం భిన్నంగా ఉంటుంది. పేజీలకు పేజీలు భారీ డైలాగులు త్రివిక్రమ్ చిత్రాల్లో కనిపించవు.
తన పదునైన మాటలతో త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కు సరికొత్త నిర్వచనం చెప్పారు. నేడు ఈ మాటల మాంత్రికుడి పుట్టినరోజు. నేడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 47వ పడిలోకి అడుగుపెట్టాడు. నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, వాసు లాంటి చిత్రాలతో రచయితగా తానేంటో నిరూపించుకున్న త్రివిక్రమ్.. నువ్వే నువ్వే చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నమే విజయవంతం కావడంతో స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కింది.

ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో అతడు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జనాలు ఇప్పటికి టీవీలకు అతుక్కునిపోయి మరీ చూస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన అరవింద సమేత చిత్రం ఘనవిజయం సాధించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి కథతో సినిమాలు తెరకెక్కించినా ఫ్యామిలీ అంశాలు తప్పనిసరిగా ఉంటాయి. అందుకే త్రివిక్రమ్ చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతారు.


Click it and Unblock the Notifications