బ్రహ్మీ 'జఫ్ఫా' అనే పదం ఎప్పుడు పుట్టిందో తెలుసా.. మొదటిసారి వాడింది ఆ సినిమాలోనే

సోషల్ మీడియా కారణంగా సినిమాలోని కొన్ని పాత్రలు డైలాగ్స్ ఒక ట్రెండ్ సెట్ చేసే విధంగా వైరల్ అవుతున్నాయి. సీరియస్ డైలాగ్ అయినా ఎమోషనల్ పదం అయినా లేక కామెడీ పంచ్ అయినా కూడా మీమర్స్ దేన్ని వదలడం లేదు. అయితే ఇప్పటికి బ్రహ్మానందం ట్రేడ్ మార్క్ డైలాగ్ ఏదంటే ఎవరైనా సరే జఫ్ఫా అనేస్తారు. సోషల్ మీడియాలో ఆ పదానికి మంచి క్రేజ్ ఉంది. ఇక ఆ పదం మొదట ఏ సినిమాలో వాడారు అనే విషయాన్ని ఇటీవల దాన్ని క్రియేట్ చేసిన ఒక రైటర్ వివరణ ఇచ్చారు.

ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టవు

ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టవు

ఒకప్పుడు సీనియర్ కమెడియన ఒక డైలాగ్ చెబితే జనాలు అంత ఈజీగా మర్చిపోయేవారు కాదు. కేవలం హావభావాలతోనే కడుపుబ్బా నవ్వించేవారు. ఇక అలీకి ఎంద చాట, AVS కు రంగు పడుద్ది అనే పదాలు ఒక సపరేట్ ఇమేజ్ ను అంధించాయి. ఇప్పటికి కూడా ఆ కామెడీ సీన్స్ ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టవు.

బ్రహ్మానందం ట్రేడ్ మార్క్..

బ్రహ్మానందం ట్రేడ్ మార్క్..

ఇక అందరికి ఎదో ఒక ట్యాగ్ ఉన్నట్లుగానే బ్రహ్మానందంకు జఫ్ఫా అనేది ఊతపదంలా కొనసాగుతూ వస్తోంది. టాప్ మోస్ట్ కమెడియన్ గా క్రేజ్ అందుకున్న ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ పదాన్ని వాడకుండా ఉండలేరు. ఇక సోషల్ మీడియాలో అయితే గత కొన్నేళ్లుగా మీమర్స్ కు బాగానే ఉపయోగపడుతోంది.

సినిమా టైటిల్ గా కూడా

సినిమా టైటిల్ గా కూడా

బ్రహ్మానందం అనగానే అందరికి కామన్ గా గుర్తొచ్చేది జఫ్ఫా అనే పదమే. జఫ్ఫా పదాన్ని ఏకంగా సినిమా టైటిల్ గా కూడా వాడేసుకున్న విషయం తెలిసిందే. వెన్నలకిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిన జఫ్ఫా సినిమా 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా అనుకున్నంతగా హిట్టవ్వకపోయినప్పటికి జఫ్ఫా అనే టైటిల్ తోనే సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది.

జఫ్ఫా.. అంటే..

జఫ్ఫా.. అంటే..

ఇక మొదటిసారి ఆ పదాన్ని సినిమాల్లోకి తీసుకొచ్చిన రైటర్ నివాస్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీగా వివరణ ఇచ్చారు. నిజానికి జఫ్ఫా అనేది ఇజ్రాయేల్ లో ఉన్నటువంటి ఒక పాత ఓడరేవు పేరు. ఇక రైటర్ ఆ పదాన్ని ఎప్పుడు విన్నాడో గాని సినిమాల్లో కామన్ గా వాడుకునేలా చేశాడు. గత 15 ఏళ్లుగా ఆ పదం వైరల్ అవుతూనే ఉంది.

Recommended Video

Brahmanandam Turns 65 | హీరోలని డామినేట్ చేసిన One & Only కమెడియన్
ఆ సినిమాలో మొదటిసారి

ఆ సినిమాలో మొదటిసారి

2006లో వచ్చిన అల్లరి నరేష్ పార్టీ సినిమాకు రవిబాబు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాకు పోసాని కృష్ణమురళి శిష్యుడు నివాస్ డైలాగ్స్ అందించాడు. ఇక బ్రహ్మానందం పాత్ర కోసం ఏదైనా కొత్త తరహా పదం క్రియేట్ చేయాలని జఫ్ఫా అనే దాన్ని సెట్ చేశారు. మొదట్లో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని బ్రహ్మానందం కూడా అనుమానం వ్యక్తం చేశారట. కానీ ఆ తరువాత హిట్టవ్వడంతో దాన్నే అనేక సినిమాల్లో వాడినట్లు నివాస్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X