Year End 2023: సత్తా చాటిన కొత్త దర్శకులు వీళ్లే.. అతడికి వంద కోట్లు.. ఆ డైరెక్టర్ హీరోగానూ హిట్
టాలీవుడ్‌లోకి ఎంతో మంది దర్శకులుగా వస్తుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపుతో పాటు తొలి చిత్రంతోనే విజయాలను కూడా సొంతం చేసుకుంటున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటోన్నారు. అలా ప్రతి ఏడాదీ ఎంతో కొంత మంది దర్శకులు తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే 2023వ సంవత్సరంలో కూడా చాలా మందే కొత్త దర్శకులు పరిచయం అయ్యారు. వాళ్లలోనూ కొందరు ఫస్ట్ మూవీతోనే విజయాన్ని అందుకోవడంతో పాటు మార్క్ చూపించారు. వాళ్లెవరో మీరే చూసేయండి!
కోట్ల హృదయాలు కొల్లగొట్టి:ప్రముఖ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమానే 'బలగం'. కుటుంబ విలువలను చాటి చెప్పే కథతో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ముఖ్యంగా ఇందులో స్వచ్చమైన కంటెంట్‌ను చూపించిన దర్శకుడు వేణు కోట్ల లాభాలతో పాటు ఎన్నో హృదయాలను కొల్లగొట్టి గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్నాడు.

మ్యాడ్ ఎక్కించిన కల్యాణ్:సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన కామెడీ సినిమానే 'మ్యాడ్'. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగా వచ్చింది. ముఖ్యంగా ఇందులో దర్శకుడు పంచిన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఫలితంగా మొదటి చిత్రంతోనే కల్యాణ్ శంకర్ తన సత్తాను టాలీవుడ్‌కు పరిచయం చేసేశాడు.
బెదురులంకతో మరొకరు:క్లాక్స్ అనే నూతన దర్శకుడి రూపకల్పనలో కార్తికేయ గుమ్మకొండ నటించిన లేటెస్ట్ మూవీనే 'బెదురులంక 2012'. ఫన్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రం కూడా మంచి టాక్‌ను తెచ్చుకుని భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇందులో దర్శకుడి టేకింగ్ అదిరిపోయింది. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు థ్రిల్ చేయడంలోనూ అతడు సక్సెస్ అయ్యాడు.

వంద కోట్లు కొట్టిన శ్రీకాంత్:టాలెంటెడ్ గాయ్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల రూపొందించిన మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఇందులో హీరో నానిని చూపించిన తీరుకు దర్శకుడు శ్రీకాంత్‌కు మంచి మార్కులే పడ్డాయి. పైగా ఫస్ట్ మూవీతోనే అతడు వంద కోట్ల గ్రాస్‌ను కూడా అందుకున్నాడు.
హీరోగానూ సక్సెస్ ప్రభాస్:యంగ్ టాలెంటెడ్ గాయ్ సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'మేమ్ ఫేమస్'. అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాళ్లు ఫేమస్ అవడం కోసం చేసిన ప్రయత్నాలతో ఈ చిత్రం నడుస్తుంది. ఇందులో పల్లె సంస్కృతి ఉట్టిపడే ఎన్నో అంశాలను చూపించి సుమంత్ సక్సెస్ అయ్యాడు. పైగా హీరోగానూ అతడు మెప్పించి.. రెండింటిలోనూ విజయం సాధించాడు.

ఆ దర్శకులు కూడా హిట్టే:2023లో తొలి చిత్రంతోనే హిట్ చేసిన దర్శకులు చాలా మందే ఉన్నారు. అందులో కిరణ్ అబ్బవరంతో 'వినరో భాగ్యము విష్ణు కథ' చేసిన మురళీ కిశోర్, నానితో 'హాయ్ నాన్న' తీసిన శౌర్యూవ్, సుహాస్‌తో 'రైటర్ పద్మభూషణ్' చేసిన షణ్ముఖ ప్రశాంత్ వంటి వాళ్లు ఉన్నారు. అలాగే, పూజా కొల్లూరు, రమేష్ కదూరి, పవన్ బాసంశెట్టి తదితరులు డైరెక్షన్‌తో ఆకట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











