Year Ender 2023: కోట్ల నష్టాలు చూసిన సినిమాలు.. చిరంజీవిదే చెత్త రికార్డు.. ఆ స్టార్ హీరోలకూ షాక్

2023వ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చాలా చిత్రాలు వచ్చాయి. కానీ, అందులో చాలా తక్కువ సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ఆదరాభిమానాలను దక్కించుకున్నాయి. తద్వారా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి.

కానీ, కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చి.. నిరాశనే ఎదుర్కొన్నాయి. ఫలితంగా కోట్లలో నష్టాలను చవి చూసి డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎక్కువ నష్టాలు చూసిన సినిమాలు ఏంటో మీరే చూసేయండి!

Year Ender 2023: Biggest Loss Movies Of Telugu Film Industry in 2023

ఖుషి మూవీకి భారీ నష్టాలు: విజయ్ దేవరకొండ - సమంత రూత్ ప్రభు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'ఖుషి'. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో టార్గెట్‌ను చేరుకోలేకపోయింది. దీంతో ఈ మూవీకి రూ. 11.40 కోట్లు వరకూ నష్టాలు ఎదురయ్యాయి.

Year Ender 2023: Biggest Loss Movies Of Telugu Film Industry in 2023

కస్టడీ మూవీకి అన్ని కోట్లు: అక్కినేని నాగ చైతన్య - వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ సినిమానే 'కస్టడీ'. ఈ మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే వసూళ్లు ఆశించిన రీతిలో రావట్లేదు. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల లోపే చాలా చోట్ల రన్‌ను కూడా ముగించేసింది. ఫలితంగా రూ. 19 కోట్లు వరకూ నష్టాలు మిగిలాయి.

Year Ender 2023: Biggest Loss Movies Of Telugu Film Industry in 2023

బ్రో మూవీకి మరింతగానే: సాయి ధరమ్ తేజ్ - పవన్ కల్యాణ్ కాంబోలో రూపొందిన 'బ్రో (BRO)' మూవీకి టాక్ అదిరిపోయినా.. ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రాలేదు. దీనికితోడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ చిత్రం అంతగా రాణించలేకపోయింది. దీంతో ఫుల్ రన్‌లో ఇది టార్గెట్‌ను చేరలేదు. ఫలితంగా రూ. 31.10 కోట్లు మేర నష్టాలతో ఈ మూవీ రన్‌ను ముగించాల్సి వచ్చింది.

Year Ender 2023: Biggest Loss Movies Of Telugu Film Industry in 2023

అఖిల్ మూవీకి ఎంతంటే: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించిన సినిమానే 'ఏజెంట్'. ఈ మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దారుణమైన స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే చాలా చోట్ల రన్‌ను ముగించేసింది. తద్వారా ఏకంగా రూ. 33 కోట్లు వరకూ నష్టాలను చవి చూసి డిజాస్టర్‌ అయింది.

Year Ender 2023: Biggest Loss Movies Of Telugu Film Industry in 2023

సమంత కెరీర్‌లోనే షాక్: సమంత రూత్ ప్రభు - గుణశేఖర్‌ కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రమే 'శాకుంతలం'. ఈ చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా దారుణమైన స్పందనే లభించింది. ఫలితంగా ఇది ఎక్కువ రోజులు థియేటర్లలో సందడి చేయలేదు. తద్వారా ఈ మూవీ రూ. 50 కోట్లు నష్టాలతో సమంత కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

Year Ender 2023: Biggest Loss Movies Of Telugu Film Industry in 2023

ఆదిపురుష్‌కూ నష్టాలు: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రమే 'ఆదిపురుష్'. ఓం రౌత్ తీసిన ఈ మూవీ దారుణమైన వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం నిరాశ పరిచింది. వేరే భాషల్లో సైతం ఇది పెద్దగా రాణించలేదు. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు పోగా రూ. 50 కోట్లు నష్టాలను చవి చూసి నిరాశ పరిచింది.

Year Ender 2023: Biggest Loss Movies Of Telugu Film Industry in 2023

చిరంజీవిదే చెత్త రికార్డ్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రమే 'భోళా శంకర్'. ఈ మూవీకి మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్లు సరిగా రాలేదు. ఫలితంగా ఇది రూ. 54 కోట్లు నష్టాలతో ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా సినిమాలు భారీ నష్టాలను ఎదుర్కొని నిరాశ పరిచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X