Year Ender 2023: ఈ ఏడాది టాప్ సినిమాలు.. బాలయ్య దిమ్మతిరిగే రికార్డు.. 400 కోట్లు వచ్చినా అది ఫ్లాపే
సాధారణంగా ప్రతి ఏడాది ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు వస్తూనే ఉంటాయి. గతంలో కంటే ఈ మధ్య కాలంలో అయితే తెలుగులో వచ్చే సినిమాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. అలా 2023వ సంవత్సరంలో చాలా చిత్రాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మన్ననలు పొందడంతో పాటు కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబట్టాయి. అలాంటి వాటిలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లను సాధించిన సినిమాలపై లుక్కేద్దాం పదండి!
400 కోట్లు వచ్చినా ఫ్లాపే:2023లో ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' ఒకటి. ఈ మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో స్పందన కూడా ఆశించిన రీతిలో దక్కలేదు. అయినప్పటికీ ఈ మూవీ రూ. 400 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. అయితేనేం టార్గెట్‌ను చేరుకోలేకపోవడంతో ఈ మూవీ ఫ్లాప్ స్టేటస్‌నే అందుకుంది.

చిరంజీవి కెరీర్‌లో బెస్ట్:ఈ ఏడాది అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో 'వాల్తేరు వీరయ్య' రెండో స్థానంలో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన ఈ సినిమాకు ఫుల్ రన్‌లో రూ. 230 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుని చిరంజీవి కెరీర్‌లోనే టాప్ మూవీగా రికార్డు సాధించింది.

బాలయ్య ఖాతాలో 2:ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న నటసింహా నందమూరి బాలకృష్ణ 2023లో మొదట 'వీర సింహా రెడ్డి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి రూ. 134 కోట్లు గ్రాస్ వసూళ్లు లభించాయి. అలాగే, ఇటీవలే ఆయన 'భగవంత్ కేసరి'తో వచ్చారు. ఇది రూ. 132 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా ఒకే ఏడాది రెండు భారీ హిట్లతో బాలయ్య దిమ్మతిరిగే రికార్డు సాధించారు.
నాని కూడా కొట్టాడు:తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోగా సత్తా చాటుకుంటూ వెళ్తున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ ఏడాది సమ్మర్‌లో అతడు 'దసరా' అనే పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు రూ. 117 కోట్లు గ్రాస్ వసూలు అయింది. తద్వారా నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది.

బ్రో కూడా నిరాశగానే:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమానే 'BRO'. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ఫుల్ రన్‌లో రూ. 112 కోట్లు వరకూ గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అయినప్పటికీ ఈ చిత్రం మాత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోలేదు. ఫలితంగా కొన్ని కోట్ల నష్టాలను ఎదుర్కొని పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది.
పైన పేర్కొన్న సినిమాలే కాదు.. ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఇంకా కొన్ని సినిమాలు కూడా భారీ వసూళ్లతో సత్తా చాటాయి. వాటి గురించిన వివరాలను మరో స్టోరీలో చూద్దాం!


Click it and Unblock the Notifications











