Year Ender 2023: వివాదాల్లో చిక్కుకున్న తెలుగు స్టార్లు వీళ్లే.. టాలీవుడ్‌ను షేక్ చేసిన గొడవలే ఇవే

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి గతంలో కంటే ఇప్పుడు భారీ స్థాయిలో పెరిగిపోతోంది. అందుకే మన దగ్గర మార్కెట్ పెంచుకోడానికి, ఫాలోయింగ్ ఏర్పరచుకోడానికి చాలా మంది పక్క ఇండస్ట్రీల వాళ్లు పోటీ పడుతున్నారు. అదే సమయంలో మన వాళ్ల రేంజ్ కూడా భారీగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ టాలీవుడ్‌లో ఎన్నో వివాదాలు చెలరేగుతున్నాయి. అలా 2023వ సంవత్సరంలో కొన్ని కాంట్రవర్శీలు హైలైట్ అయ్యాయి. అసలు ఇవి ఎలా వచ్చాయి? వీటి వల్ల హాట్ టాపిక్ అయిన హీరోలు ఎవరు? అనే విషయాలను చూద్దాం పదండి!

2023వ సంవత్సరంలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యాయి. అలాంటి వాటిలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' ఒకటి. ఈ సినిమా వల్ల ఎన్నో వివాదాలు చెలరేగాయి. ఇందులో చూపించిన సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఫలితంగా ప్రభాస్‌పైన కూడా కొన్ని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

Year Ender 2023: Most Highlighted Controversies In Tollywood This Year

ఈ ఏడాది రాజకీయంగా వివాదాలను రేపిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అందులో పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' ఒకటి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ఏ మంత్రిని పోలిని క్యారెక్టర్ పెట్టారని పెద్ద రాద్దాంతమే జరిగింది. దీంతో ఈ సినిమా కలెక్షన్లు, కనెక్షన్ల గురించి కూడా సదరు మంత్రి ఎన్నో విమర్శలు చేశారు. అలాగే, హీరో పవన్‌పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

2023వ ఏడాదిలో వివాదంగా మారిన సినిమాలు చాలానే ఉన్నా.. అందులో ఇటీవలే రూపొందిన రాంగోపాల్ వర్మ 'వ్యూహం' కూడా ఉంది. ఈ చిత్రాన్ని విడుదల చేయొద్దంటూ చాలా మంది అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇటీవలే తెలంగాణ హైకోర్టు కూడా ఈ సినిమా విడుదలను జనవరి 12వ తేదీ వరకూ ఆపాలని తీర్పు ఇచ్చింది.

Year Ender 2023: Most Highlighted Controversies In Tollywood This Year

సినిమాలు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న ఎన్నో అంశాలు కూడా వివాదంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 'ఏజెంట్' సినిమా పరాజయం పాలవడంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు చేసిన రచ్చ గురించి తెలిసిందే. ఇది పెద్ద కేసు కూడా అయింది. అలాగే, మరో డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయలేదని పెద్ద చర్చ తెరపైకి వచ్చింది.

2023లో కొంత మంది సినీ ప్రముఖులు కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఓ ఫంక్షన్‌లో 'అక్కినేని తొక్కినేని' అనడం పెద్ద కాంట్రవర్శీకి కారణం అయింది. దీనిపై అక్కినేని ఫ్యామిలీ మొత్తం స్పందించింది. అలాగే, 'కేజీఎఫ్' సినిమాపై యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన కామెంట్లు కూడా దుమారాన్నే రేపాయి.

ఈ ఏడాదిలో అనసూయ భరద్వాజ్ - విజయ్ దేవరకొండ మధ్య తలెత్తిన వివాదం ఏ రేంజ్‌లో హైలైట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిపై ఇరువురి అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ గొడవలు పెట్టుకున్నారు. అలాగే, మంచు బ్రదర్స్ మధ్యన కూడా పెద్ద గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఓ వీడియో కూడా వైరల్ అయింది.

Year Ender 2023: Most Highlighted Controversies In Tollywood This Year

2023వ సంవత్సరంలో కొన్ని పాటలు, డైలాగులు, పోస్టర్లు ముఖ్యంగా రిలీజ్ డేట్‌లు కూడా వివాదాలకు కారణం అయ్యాయి. అలాగే, మీడియా ప్రతినిధులతో సెలెబ్రిటీల వాదనలు కూడా హైలైట్ అయ్యాయి. ఇవి మాత్రమే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమలో, సినీ రంగంతో సంబంధం ఉన్న సెలెబ్రిటీలు కొన్ని మాటల వల్ల వివాదాల్లో చిక్కుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X