Year Ender 2023: ప్రభాస్ తగ్గేదేలే... 2023 టాప్ ఓపెనింగ్ సినిమాల్లో సలార్ రికార్డు!
బహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ఏ సినిమా ఆస్థాయిలో ఆశించలేకపోయింది. ఇక ప్రభాస్ పని అయిపోయింది.. చాలా మంది కామెంట్స్ చేశారు. ఎంత మంది ఎన్ని కామెంట్స్ చేసినా.. అంతే వేగంతో సలార్ అంటూ ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా సూపర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇండియన్ సినిమాల్లో వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ లో సలార్ సంచలనం సృష్టించింది. ఆ వివరాల్లోకి వెళితే...
ఇండియా వ్యాప్తంగా ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు వస్తుంటాయి.. అయితే వాటిలో మెప్పించేవి మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అయితే 2023 ఇండియన్ సినిమాల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ ఓపెనింగ్స్‌లో టాప్ మూవీగా సలార్ సినిమా నిలిచింది. ఇక ఈ సినిమాతో ఏ ఏ సినిమాలు ఉన్నాయో చూద్దాం.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు. పృథ్విరాజ్ సుకమార్, శృతి హాసన్, జగపతి బాబు వంటి వారు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ మూవీకి మొదటి రోజే రూ.178 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక 2023 ఇండియన్ సినిమాల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ ఓపెనింగ్స్‌లో టాప్ మూవీగా సలార్ నిలిచింది.
ఆ తర్వాత స్థానంలో వచ్చిన లియో వరల్డ్ వైడ్ గ్రాస్ ఓపెనింగ్స్‌లో రూ.146 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటింగా.. త్రిష హీరోయిన్ గా నటించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వందల కోట్లను వసూలు చేసింది. ఇక ఆ తర్వాతి స్థానంలో మళ్లీ ప్రభాస్ మూవీనే నిలిచింది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ రూ.137 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది.

4వ స్థానంలో బాలీవుడ్ బాద్షా నటించిన జవాన్ నిలిచింది. ఈ చిత్రం రల్డ్ వైడ్ గ్రాస్ ఓపెనింగ్స్‌లో రూ.126 కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. ఇక 5వ స్థానంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ సినిమా తెరకెక్కింది. ఇక ఈ మూవీ రూ.115.60కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఆ తర్వాతి స్థానంలో పటాన్ సినిమా నిలిచింది. ఇక ఈ సినిమా రూ.105 కోట్లు రాబట్టింది.
సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 రూ. 97 కోట్లతో ఆరో స్థానంలో ఉండగా... ఏడవ స్థానంలో రజినీ కాంత్ నటించిన జైలర్ సినిమా నిలిచింది. ఇక ఈ సినిమా రూ.91.20 కోట్లు రాబట్టింది. ఇక ఆ తర్వాత మళ్లీ తమిళ చిత్రం పొన్నియన్ సెల్వన్ 2 నిలిచింది. ఈ సినిమా రూ. 59.12 కోట్లు రాబట్టింది. ఇక 10వ స్థానంలో గదర్ 2.. రూ.53.50 కోట్లతో నిలిచింది.
2023వ సంవత్సరంలో రిలీజ్ అయి అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల జాబితాలో నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' సినిమా టాప్ 11లో చోటు దక్కించుకుంది. ఈ చిత్రం మొదటి రోజు రూ. 50.10 కోట్లు వసూలు చేసింది. 2023వ ఏడాదిలో అత్యధిక ఓపెనింగ్ గ్రాస్‌ను వసూలు చేసిన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ 49.10 కోట్లతో 12వ స్థానంలో నిలిచింది. అలాగే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన BRO మూవీ 48.50 కోట్ల గ్రాస్ వసూళ్లతో 13వ స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications











