Year Ender 2023: సినీ రంగానికి వరుస షాక్‌లు.. మరణించిన స్టార్లు వీళ్లే.. 23 రోజులు పోరాడి ఓడిన హీరో
2023వ సంవత్సరం ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమల్లో ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఏడాది తమ జీవితాల్లో కొత్త వెలుగులను తెచ్చుకున్నారు. అదే సమయంలో అన్ని ఇండస్ట్రీల్లోనూ చాలా మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. అందులోనూ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది స్టార్లు మరణించారు. ఈ ఏడాది కొద్ది రోజుల్లోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో 2023లో ప్రాణాలు కోల్పోయిన టాలీవుడ్ ప్రముఖులను ఓ సారి గుర్తు చేసుకుందాం పదండి!
Recommended Video

2023వ సంవత్సరంలో సుధీర్ వర్మ (34) అనే నటుడి మరణంతో టాలీవుడ్‌లో విషాదాలు ప్రారంభం అయ్యాయి. 'సెకండ్ హ్యాండ్', 'కుందనపు బొమ్మ' వంటి సినిమాల్లో నటించిన అతడు జనవరి ఆరంభంలో మరణించారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన వైజాగ్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ న్యూస్ అప్పుడు సెన్సేషన్ అయింది.

ఈ ఏడాది టాలీవుడ్‌లో లెజెండరీ నటీమణులు కూడా మరణించారు. అందులో సీనియర్ నటి జమున ఒకరు. సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేసిన ఆమె.. కొంత కాలంగా వృద్దాప్య పరమైన సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే 2023, జనవరి 27వ తేదీన ఆమె తుదిశ్వాసను విడిచారు.
అలాగే, దాదాపు ఆరు దశాబ్దాల పాటు తనదైన చిత్రాలతో అలరించిన కళాతపస్వీ కే విశ్వనాథ్ ఫిబ్రవరి 2వ తేదీన కన్నుమూశారు. కొంత కాలం పాటు అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడిన ఆయన.. తీవ్ర అస్వస్థతకు గురై ఓ ఆస్పత్రిలో తుదిశ్వాసను విడిచారు.

నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చి తనదైన చిత్రాలతో అలరించిన తారకరత్న కూడా ఈ ఏడాది కన్నుమూశారు. ఓ ర్యాలీలో పాల్గొన్న సమయంలో గుండెపోటుకు గురైన ఆయన.. దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేశారు. కానీ, ఇందులో ఓడిపోయి ఫిబ్రవరి 18వ తేదీన తుదిశ్వాసను విడిచారు.
తెలుగు ప్రేక్షకులకు తనదైన సంగీతంతో మజాను అందించిన రాజ్ మే 21న తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఈయన కోటితో కలిసి ఎన్నో చిత్రాలకు అదిరిపోయే పాటను అందించిన విషయం తెలిసిందే.
చాలా ఏళ్ల పాటు టాలీవుడ్‌లో గుర్తుండిపోయే పాత్రలను చేస్తూ అలరించిన సీనియర్ నటుడు శరత్ బాబు కూడా ఈ ఏడాదిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. చాలా కాలం పాటు కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడిన ఆయన.. మే 22న మరణించిన విషయం తెలిసిందే.
కొరియోగ్రాఫర్‌గా, సోషల్ మీడియా సెన్సేషన్‌గా ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్ ఈ ఏడాది జూన్ 18న కన్నుమూశారు. ఈయన 'ఆట', 'ఢీ' వంటి రియాల్టీ షోల ద్వారా కెరీర్‌ను మొదలు పెట్టారు. ఇలా 1500కి పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.

దాదాపు ఐదు దశాబ్దాలకు పైగానే తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటుడు చంద్రమోహన్.. గుండెపోటు కారణంగా నవంబర్ 11వ తేదీన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మరణించారు. తద్వారా సినీ పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు.
వీళ్లు మాత్రమే కాదు.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి జనవరి 27 న హార్ట్ ఎటాక్‌తో కన్నుమూశారు. అలాగే, గాయని వాణీ జయరాం (77) కూడా అనారోగ్య కారణాలతో ఫిబ్రవరి 4వ తేదీన కన్నుమూశారు. అంతేకాదు, ప్రముఖ హాస్య నటులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనోబాల, ప్రముఖ తమిళ కమెడియన్ మయిల్ సామి, భోజ్ పురి నటి ఆకాంక్ష దుబే, హిందీ సీరియల్ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ సహా ఎంతో మంది ప్రముఖులు 2023లో కన్నుమూశారు. ఇక, తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్‌కాంత్ కూడా నేడు (డిసెంబర్ 28) మరణించారు.


Click it and Unblock the Notifications











