Year Ender 2023: 2 ఫ్లాప్‌లు చూసిన హీరోలు.. ఇందులో ఒక్కడే స్టార్.. ప్రభాస్ తమ్ముడు చెత్త రికార్డు
సాధారణంగా ఒక హీరో సినిమా చేయడానికి తక్కువలో తక్కువగా ఆరేడు నెలలు సమయం అయినా తీసుకుంటాడు. అదే స్టార్ హీరోలు అయితే కనీసం ఏడాది టైం పడుతుంది. అంత కష్టపడినా ఫలితాలు ప్రతిసారీ మంచిగానే వస్తాయని చెప్పలేం. అలా 2023వ సంవత్సరంలో స్టార్, యంగ్ హీరోలు ఎన్నో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొందరైతే రెండు అంతకంటే ఎక్కువ సినిమాలు కూడా చేశారు. అలాంటి వారిలో ఈ సంవత్సరంలో రెండు కంటే ఎక్కువ ఫ్లాపులు చవి చూసిన హీరోల గురించి ఈ స్టోరీలో చూద్దాం పదండి!
ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. అందులో సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ఒకరు. ఈ ఏడాది అతడు 'హంట్', 'మామా మశ్చీంద్రా' అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ రెండు చిత్రాలూ జీరో షేర్‌తో బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.

2023లో రెండు సినిమాలతో వచ్చిన మరో హీరో నాగశౌర్య. ఈ ఏడాది ఆరంభంలో ఈ హ్యాండ్సమ్ హీరో 'ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి' అనే చిత్రంతో వచ్చాడు. కానీ, ఇది ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది. ఆ తర్వాత నాగశౌర్య 'రంగబలి' అనే కామెడీ ఎంటర్‌టైనర్ చేశాడు. దీనికి మంచి టాక్ వచ్చినా బాక్సాఫీస్ ముందు మంచి ప్రదర్శన చేయలేక ఫ్లాప్ అయింది.
ఈ సంవత్సరంలో కిరణ్ అబ్బవరం ఏకంగా మూడు సినిమాలు చేశాడు. అందులో ముందుగా 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రంతో వచ్చాడు. ఇది డీసెంట్ టాక్‌తో హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఆ తర్వాత వచ్చిన 'మీటర్' మాత్రం జీరో షేర్ మూవీగా మిగిలింది. అనంతరం చేసిన 'రూల్స్ రంజన్' చిత్రం కూడా డిజాస్టర్‌గా మిగిలి కిరణ్‌కు షాక్ ఇచ్చింది.

2023వ సంవత్సరంలో ఎక్కువ సినిమాలు చేసిన హీరో సంతోష్ శోభన్. ఇతగాడు ఈ ఏడాదిలో ముందుగా 'కల్యాణం కమనీయం' అనే సినిమాతో వచ్చాడు. ఆ తర్వాత 'శ్రీదేవి శోభన్ బాబు', 'అన్నీ మంచి శకునములే', 'ప్రేమ్ కుమార్' వంటి చిత్రాలు చేశాడు. కానీ, ఇవి కూడా డిజాస్టర్లు అయ్యాయి. ఫలితంగా ఈ ఏడాది ఏకంగా నాలుగు ఫ్లాపులతో చెత్త రికార్డు సాధించాడు.
ఈ ఏడాదిలో ఎక్కువ హీరోలతో వచ్చిన స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య'ను చేసిన అతడు విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ, ఆ తర్వాత 'రావణాసుర' అంటూ వచ్చాడు. ఇది మాత్రం పరాజయం పాలైంది. ఆ తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు' మూవీని కూడా చేశాడు. ఇది కూడా హిట్ స్టేటస్‌ను చేరుకోలేకపోయింది.

వీళ్లు మాత్రమే కాదు.. 2023లో ఇంకా చాలా మంది హీరోలు కూడా రెండు లేదా అంతకంటే ఎక్కువ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో నందమూరి బాలకృష్ణ రెండు విజయాలను అందుకున్నారు. మిగిలిన హీరోల్లో ఒక హిట్, ఒక ఫ్లాప్ అలా చూశారు. మొత్తానికి పైన చెప్పుకున్న హీరోలకు మాత్రం 2023 చేదు అనుభవాన్నే మిగిల్చిందని చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











