Year Ender 2023: యంగ్ స్టార్ హీరోలకు బిగ్ షాక్.. బ్రదర్స్ అట్టర్ ఫ్లాప్.. కోట్ల నష్టాలతో దారుణంగా!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. అదే సమయంలో ఎంతో మంది టైర్ 2 లేదా యంగ్ స్టార్ హీరోలు కూడా ఉన్నారు. వీళ్లు కనీసం ఏడాది ఒక సినిమాతోనైనా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటున్నారు. అలా 2023వ సంవత్సరంలో టాలీవుడ్‌లోని యంగ్ హీరోలు అందరూ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వారిలో ఒక్కరిద్దరు మాత్రమే హిట్లు కొట్టగా.. మిగిలిన వాళ్లందరికీ బిగ్ షాక్ తగిలింది. మరి ఆ జాబితాలో ఏ హీరోలు ఉన్నారో మీరే చూసేయండి మరి!

భారీ హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అతడు నటించిన సినిమానే 'ఏజెంట్'. ఈ మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దారుణమైన స్పందన దక్కింది. ఫలితంగా ఇది రూ. 33 కోట్లు వరకూ నష్టాలను చవి చూసి డిజాస్టర్‌‌గా మిగిలిపోయింది.

Year Ender 2023: Tollywood Young or Tire 2 Heroes Fail to Get Hits in This Year

అఖిల్ మాదిరిగానే వాళ్ల సోదరుడు నాగ చైతన్య కూడా హిట్ కోసం చూస్తున్నాడు. ఇందుకోసం అతడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' అనే సినిమాను చేశాడు. ఈ మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే వసూళ్లు ఆశించిన రీతిలో రావట్లేదు. ఫలితంగా ఈ సినిమాకు రూ. 19 కోట్లు వరకూ నష్టాలు మిగిలాయి.

స్టార్‌ హీరో అయ్యేందుకు ప్రయత్నిస్తున్న విజయ్ దేవరకొండ - సమంత రూత్ ప్రభు కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'ఖుషి'. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో టార్గెట్‌ను చేరుకోలేకపోయింది. దీంతో ఈ మూవీకి రూ. 11.40 కోట్లు వరకూ నష్టాలు ఎదురయ్యాయి.

Year Ender 2023: Tollywood Young or Tire 2 Heroes Fail to Get Hits in This Year

2023లో భారీ సినిమాతో వచ్చిన హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అతడు నటించిన సినిమానే 'స్కంద'. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన ఈ చిత్రానికి సైతం ప్రేక్షకులు ఆశించిన రీతిలో స్పందనను అందించలేదు. ఫలితంగా ఈ మూవీ కూడా నష్టాలతోనే రన్‌ను ముగించుకోవాల్సి వచ్చింది.

ఈ సంవత్సరంలో ఎలాగైనా హిట్ కొట్టాలని వచ్చిన యంగ్ హీరోల్లో మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. అతడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' అనే యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫలితంగా ఇది కూడా డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

Year Ender 2023: Tollywood Young or Tire 2 Heroes Fail to Get Hits in This Year

ఇక, చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తోన్న యూత్ స్టార్ నితిన్ కూడా ఈ ఏడాది 'ఎక్స్‌స్టా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాతో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చాడు. కానీ, అతడి ప్రయత్నం కూడా ఫలించలేదు. ఈ చిత్రం కేవలం వారం రోజులు కూడా థియేటర్లలో సందడి చేయలేదు. ఫలితంగా అత్యధిక నష్టాలతో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీగా నిలిచిపోయింది.

వీళ్లు మాత్రమే కాదు.. గోపీచంద్ కూడా ఈ ఏడాది 'రామబాణం' అనే సినిమాతో వచ్చాడు. ఇది కూడా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అలాగే, వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న నిఖిల్ 'స్పై' మూవీతో వచ్చాడు. ఇది కూడా నిరాశ పరిచింది. అంతేకాదు, నరేష్ 'ఉగ్రం' అనే సినిమా చేశాడు. దీనికి మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు రాలేదు. ఇలా ఈ హీరోలకు ఈ ఏడాది షాకిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X