For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Tollywood Debut Heroines: ఒక్క సినిమాకే పిచ్చేక్కించారు.. రికార్డులు బద్దలు కొట్టిన భామలు వీళ్లే

  |

  2020వ సంవత్సరం మాదిరిగానే 2021లో కూడా చిత్ర పరిశ్రమకు పలు రకాలుగా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ సృష్టించిన అలజడి వల్ల చాలా నెలల పాటు సినిమాల షూటింగులు నిలిపోవడంతో పాటు థియేటర్లు కూడా మూతపడ్డాయి. దీంతో చాలా మంది నిర్మాతలకు నష్టాలు ఎదురవడంతో పాటు ఇండస్ట్రీలను నమ్ముకున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక, ఈ ఏడాది వచ్చిన చిత్రాలు తక్కువే అయినా.. అందులో కొత్త హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వాళ్లలోనూ కొందరు ఫస్ట్ మూవీతోనే రికార్డులు బద్దలు కొట్టేశారు. అసలేంటీ వ్యవహారాలు? పూర్తి వివరాలు మీకోసం!

  కుర్రాళ్లలో ఉప్పెన రేపిన కృతి శెట్టి

  కుర్రాళ్లలో ఉప్పెన రేపిన కృతి శెట్టి

  మెగా కాంపౌండ్‌కు చెందిన వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమా ద్వారానే కృతి శెట్టి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు హీరోయిన్‌ను తెలుగు వాళ్లకు బాగా దగ్గర చేసేసింది. దీంతో ఈ బ్యూటీ కుర్రాళ్లకు క్రష్‌గానూ మారింది. అలాగే, ఆఫర్లను కూడా భారీ స్థాయిలో అందుకుంది.

  Pushpa Business: షాకిస్తోన్న పుష్ప బిజినెస్.. బాహుబలిని దాటేసి రికార్డు.. అన్ని కోట్లు వస్తేనే హిట్

  రొమాన్స్ చేసిన ఢిల్లీ బ్యూటీ కేతిక

  రొమాన్స్ చేసిన ఢిల్లీ బ్యూటీ కేతిక

  పూరీ జగన్నాథ్ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో అకాశ్ పూరీ హీరోగా నటించిన చిత్రమే 'రొమాంటిక్'. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టింది ఢిల్లీ చిన్నది కేతిక శర్మ. మొదటి చిత్రమే అయినా తనదైన శైలి నటన, అందంతో ప్రేక్షకులను మెప్పించింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం పెంచుకుంది.

  పెళ్లి సందడి బాగా చేసేసిన శ్రీలీల

  పెళ్లి సందడి బాగా చేసేసిన శ్రీలీల

  శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా చేసిన చిత్రమే 'పెళ్లి సందD'. గౌరీ రోణంకి తెరకెక్కించిన ఈ సినిమా నెగెటివ్ టాక్ ఉన్నా.. కలెక్షన్లను మంచిగానే రాబట్టి హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ద్వారానే తెలుగు వాళ్లకు పరిచయమైంది శ్రీలీల. ఇందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఫిదా చేసింది. తద్వారా ఎన్నో ఆఫర్లను అందుకుంటోంది.

  Pushpa Business: షాకిస్తోన్న పుష్ప బిజినెస్.. బాహుబలిని దాటేసి రికార్డు.. అన్ని కోట్లు వస్తేనే హిట్

  మరో జాతి రత్నం దొరికేసిందిగా

  మరో జాతి రత్నం దొరికేసిందిగా


  ఈ ఏడాది విడుదలై భారీ విజయాలను అందుకున్న చిత్రాల్లో 'జాతి రత్నాలు' ఒకటి. అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. అలాగే, ఫరియా అబ్దుల్లా ఈ మూవీతో ఆరంగేట్రం చేసింది. ఇందులో ఆమె చేసిన రోల్‌కు తెలుగు ప్రేక్షకుల మైమరిచపోయారు. అలాగే, ఈ అమ్మడు గ్లామర్‌కు కుర్రాళ్లందరూ పిచ్చిక్కిపోయి చిట్టి అని పాటలు పాడేశారు.

  అద్భుతం చేసేసిన వారసురాలు

  అద్భుతం చేసేసిన వారసురాలు

  బాల నటుడిగా తెరంగేట్రం చేసి, ఇప్పుడు కథానాయకుడిగా మారిన తేజ సజ్జా.. జీవిత, రాజశేఖర్‌ల కుమార్తె శివానీ రాజశేఖర్‌ జోడీగా నటించిన చిత్రం 'అద్భుతం'. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సినిమా మంచి స్పందనను అందుకుని హిట్‌గా నిలిచింది. ఇక, ఈ మూవీలో శివానీ రాజశేఖర్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను తన వైపు చూసేలా చేసుకుంది.

  సినీ ప్రియులకు ఊహించని ట్రీట్: బాలకృష్ణతో రాజమౌళి.. స్టార్ ప్రొడ్యూసర్ అదిరిపోయే ప్లాన్

  ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా

  ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా


  యూత్ స్టార్ నితిన్ - చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'చెక్'. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా పరాజయం పాలైంది. ఇందులో రకుల్ హీరోయిన్‌గా నటించింది. అలాగే, గతంలో మలయాళ చిత్రంలో కన్నుగీటి ఫేమస్ అయిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఈ మూవీ ద్వారా తెలుగులోకి వచ్చింది. కానీ, ఆమెకు సరైన ఆరంభం దక్కలేదనే చెప్పుకోవాలి.

  Recommended Video

  Wedding Of Priyanka Chopra’s Brother Siddharth Called Off? || Filmibeat Telugu
  ఇంకా ఎవరెవరు ఎంట్రీ ఇచ్చారు

  ఇంకా ఎవరెవరు ఎంట్రీ ఇచ్చారు

  2021లో వీళ్లతో పాటు మరికొంత మంది హీరోయిన్లు పరిచయం అయ్యారు. వారిలో 'ఇచ్చట వాహనములు నిలపరాదు' మూవీతో మీనాక్షి చౌదరి, 'నాట్యం' మూవీతో సంధ్యా రాజు, 'రాజా విక్రమార్క'తో తన్య రవిచంద్రన్, 'అనుభవించు రాజా' మూవీతో కశీష్ ఖాన్, 'వివాహ భోజనంబు' చిత్రంతో ఆర్జావీ, 'నాంది'తో నవమి గాయక్, 'తెల్లవారితో గురువారం'తో మిషా నారంగ్, 'గాలి సంపత్'తో లౌలీ సింగ్‌లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

  English summary
  In 2021 too saw many talented actresses making their debut in the Telugu industry and making a mark with their acting and glamour.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X