2021లో విడిపోయిన సెలబ్రిటీ జోడీలు.. సమంత చైతు నుంచి అమీర్ ఖాన్ - కిరణ్ రావ్ వరకు..

రంగుల ప్రపంచంలో నిత్యం ఎంతో మందిని కలుసుకునే సెలబ్రిటీలు కొన్నిసార్లు ఊహించని విధంగా వారే బంధాలను కూడా అందులోనే వెతుక్కుంటూ ఉంటారు. అయితే ఆ ప్రపంచంలో కలకాలం కొనసాగే ప్రేమలో మాత్రం చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పాలి ఎంత త్వరగా ప్రేమించుకుంటారో విడిపోయే వారు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా 2021లో కొంతమంది ప్రముఖ సెలబ్రెటీ లో విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

అమీర్ ఖాన్ - కిరణ్ రావు..

అమీర్ ఖాన్ - కిరణ్ రావు..

15 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి అమీర్ ఖాన్ కిరణ్ రావు ఈ ఏడాది జూలై 3వ తేదీన విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కిరణ్ ను పెళ్లి చేసుకోవడం కంటే ముందే ముందే 2002లో అమీర్ రీనా దత్తతో పదహారేళ్ల దాంపత్య జీవితానికి వీడ్కోలు పలికాడు. ఈ విషయం ప్రేక్షకులను అలాగే సినీ ప్రముఖులను కూడా అందరినీ ఆశ్చర్యానికి కలిగించింది.

సమంత అక్కినేని నాగ చైతన్య

సమంత అక్కినేని నాగ చైతన్య


టాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నాగచైతన్య రెండవ సినిమాతోనే సమంత కి చాలా దగ్గరయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలతో వీరి బంధం పెళ్లి వరకు వచ్చింది. ఇక ఐదేళ్ల ప్రేమ అనంతరం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సమంత నాగచైతన్య ఆ తర్వాత మరో ఐదేళ్ల వరకు కూడా కలిసి ఉండలేక పోయారు. సూపర్ నెలలో ఇద్దరూ విడిపోతున్నట్లు గా అఫీషియల్గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

కామిలా కాబెల్లో - షాన్ మెండిస్

కామిలా కాబెల్లో - షాన్ మెండిస్

గాయకులు షాన్ మెండిస్, కెమిలా కాబెల్లో రెండు సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత నవంబర్‌లో విడిపోతున్నట్లుగా చెప్పేశారు. ఈ ప్రముఖ జంట తమ సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో బ్రేకప్ వార్తను ప్రకటించారు. మేము మా రొమాంటిక్ సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాము, అయితే ఒకరిపై మరొకరికి మా ప్రేమ గతంలో కంటే బలంగా ఉంది. మేము మా సంబంధాన్ని మంచి స్నేహితులుగా ప్రారంభించాము. మంచి స్నేహితులుగా కొనసాగుతాము.. అని తెలియజేశారు.

 జైన్ మాలిక్ - జిగి హడిద్

జైన్ మాలిక్ - జిగి హడిద్


2015 చివరి నుండి మళ్లీ రిలేషన్‌షిప్‌లో ఉన్న జైన్ మాలిక్ మరియు గిగి హడిద్, 2021లో విడిపోయారు. వీరి భంధంపై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. కుటుంబంలో కలహాలు కూడా వచ్చినట్లు సోషల్ మీడియాలో వారు చేసిన ట్వీట్స్ తోనే అర్ధమయ్యింది. జైన్ మాత్రం ఎప్పటికప్పుడు తన తప్పు లేదని సోషల్ మీడియాలో తన వాదనను వినిపిస్తునే ఉన్నాడు. ఈ స్టార్స్ విడిపోవడం కూడక్ అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది.

సుస్మితా సేన్ - రోహ్మన్ షాల్

సుస్మితా సేన్ - రోహ్మన్ షాల్


ఒకప్పటి గ్లామర్ బ్యూటీ సుస్మితా సేన్ మరియు బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్ షాల్ విడిపోయారనే పుకార్లు గతంలో చాలా వచ్చాయి. అయితే ఈ మాజీ మిస్ యూనివర్స్ ఇటీవల రోహ్‌మాన్‌తో తన రొమాంటిక్ జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేసింది.. చాలా కాలం తరువాత ముగిసిందని.. సోషల్ మీడియాలో డైరెక్ట్ గా చెప్పేసింది. కానీ ప్రస్తుతం అయితే వారు స్నేహితులుగానే ఉన్నట్లు వివరణ ఇవ్వడం విశేషం. రోహ్‌మాన్‌తో ఉన్న ఒక ఫొటోను కూడా పోస్ట్ చేసిన సుస్మితా సేన్ తన పోస్ట్‌లో ఇలా వ్రాశారు.. మేము స్నేహితులుగా మొదలైన మేము ఎప్పటికి, ఎప్పటికి స్నేహితులుగా ఉండాలని అనుకున్నట్లు వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X