అవెంజర్స్‌: ఎండ్‌గేమ్ చూసిన వైఎస్ జగన్... థియేటర్ల ప్రత్యక్షమవ్వడంతో..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఇక ఫలితాలపైనే దృష్టిపెట్టారు. కొందరు ముఖ్య నేతలు తమ గెలుపోటములపై చర్చలు జరుపుతుండగా.. ఎన్నికల ఫలితాలు టెన్షన్‌కు దూరంగా మరికొందరు విహారయాత్రలు చేస్తున్నారు. ఎన్నికల టెన్షన్‌ను పట్టించుకోకుండా వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో కనిపిస్తున్నారు. గత నెల రోజులుగా ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే..

ఏఎంబీలో వైఎస్ జగన్ ప్రత్యక్షం

ఏఎంబీలో వైఎస్ జగన్ ప్రత్యక్షం

ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం సంచలన విజయం సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వైఎస్ జగన్ గురువారం రాత్రి ఏఎంబీ సినిమాస్‌లో తన నాయకులతో కలిసి కలిసి చూశారు. ఈ సందర్భంగా థియేటర్ వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. థియేటర్‌లో వైఎస్ జగన్ ప్రత్యక్షం కావడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎప్పటిలానే తన స్టయిల్‌లో జగన్ ప్రేక్షకులకు అభివాదం చేశారు.

 లండన్‌కు వెళ్లిన వైఎస్ జగన్

లండన్‌కు వెళ్లిన వైఎస్ జగన్

ప్రస్తుతం వైఎస్ జగన్ శుక్రవారం మరోసారి విదేశీ టూర్ వెళ్లారు. లండన్‌లో చదువుతున్న తన కూతురు, కుటుంబ సభ్యులతో కలిసి జగన్ శుక్రవారం లండన్‌కు వెళ్లడం మీడియాలో వార్త ప్రముఖంగా కనిపించింది. మే 14వ తేదీ వరకు జగన్ లండన్‌లో ఉంటారు. 14వ తేదీ రాత్రికి జగన్ హైదరాబాద్‌కు చేరుకొంటారు అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

గతంలోనూ కూడా ఫారిన్

గతంలోనూ కూడా ఫారిన్

గతంలో ఎన్నికల తర్వాత కుటుంబ సభ్యులతో విదేశాల్లో విహారయాత్ర చేశారు. జనం మధ్య మమేకమైన వైఎస్ జగన్ ఆటవిడపుగా ఫారిన్‌కు వెళ్లారు. న్యూజిలాండ్‌కు వెళ్లిన ఆయన బంగీ జంప్ కూడా చేయడం మీడియాను ఆకర్షించాయి. సమయం చిక్కితే జగన్ తన కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లారు.

మే 23న ఓట్ల లెక్కింపు

మే 23న ఓట్ల లెక్కింపు

ఆంధ్రప్రదేశ్‌లో హోరాహోరీగా ఎన్నికలు ఏప్రిల్ 11న జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ గెలుపు అవకాశాలపై ధీమాగా ఉన్నారు. 175 అసెంబ్లీ సీట్లకు, 25 పార్లమెంట్ సీట్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మే 23న జరుగనున్నది. అప్పటి వరకు నేతలు విహార యాత్రలు, వినోదాలతో కాలం గడుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X