For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అలా అనగానే జగన్‌ తిట్టాడు.. పిల్లలు కావాలంటే ఇంకొకరిని చూసుకోమంటూ: మంచు విష్ణు పర్సనల్ మేటర్ లీక్

  |

  సినిమాల్లోకి ప్రవేశించి చాలా ఏళ్లే గడుస్తోన్న ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు మంచు వారి హీరో విష్ణు. అప్పుడెప్పుడో కెరీర్ ఆరంభంలో కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. చాలా కాలంగా సరైన బ్రేక్ దొరకక సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇక, పర్సనల్ లైఫ్ విషయంలో ఎంతో హ్యాపీగా ఉన్నాడీ హీరో. ఈ నేపథ్యంలో తనకు పిల్లల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చాడంటూ షాకింగ్ మేటర్‌ను లీక్ చేశాడు. ఆ సంగతులు మీకోసం!

  తెల్లచీరలో బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ (ఫొటోలు)

  అదొక్కటే భారీ హిట్.. అవి మాత్రం అలా

  అదొక్కటే భారీ హిట్.. అవి మాత్రం అలా

  మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించాడు మంచు విష్ణు. ఆరంభంలోనే పలు పరాజయాలను చవి చూసిన అతడు.. ‘ఢీ' అనే సినిమాతో మొదటి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ‘దేనికైనా రెడీ', ‘దూసుకెళ్తా' వంటి ఓ మోస్తరు విజయాలను అందుకున్న అతడు.. భారీ హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఇందుకోసం వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

  కాజల్‌తో కలిసి మోసగాళ్లు అవతారంలో

  కాజల్‌తో కలిసి మోసగాళ్లు అవతారంలో

  మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మోసగాళ్లు'. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తోన్న ఈ థ్రిల్లర్‌ మూవీకి జెఫ్రీ గీచిన్‌ దర్శకుడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరో సోదరిగా కనిపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దీనితో పాటు శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘ఢీ'కి సీక్వెల్ కూడా చేస్తున్నాడు మంచు విష్ణు.

  రెండు విధాలుగా చేసి నష్టపోతున్నాడు

  రెండు విధాలుగా చేసి నష్టపోతున్నాడు

  మంచు విష్ణు హీరోగా వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు. దీంతో అయినప్పటికీ విష్ణు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అదే సమయంలో 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి కొన్ని సినిమాలు నిర్మించాడు. అందులో అతడు నటించిన వాటితో పాటు మిగతా హీరోల చిత్రాలూ ఉన్నాయి. ఇవేమీ విష్ణుకు లాభాలు తెచ్చిపెట్టకపోగా నష్టాలనే మిగిల్చాయి.

  పాలిటిక్స్‌లోకి విష్ణు.. అలా టార్గెట్ చేస్తూ

  పాలిటిక్స్‌లోకి విష్ణు.. అలా టార్గెట్ చేస్తూ

  కొద్ది రోజుల క్రితం మంచు విష్ణు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగిన సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాడు. అదే సమయంలో ప్రముఖ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో ‘చదరంగం' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించాడు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో కొందరిని టార్గెట్ చేశారని టాక్.

  నలుగురు పిల్లలున్న హీరో విష్ణునేనని

  నలుగురు పిల్లలున్న హీరో విష్ణునేనని

  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమీప బంధువు అయిన విరానికా రెడ్డిని మంచు విష్ణు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక, ఈ జంటకు కవలలతో పాటు మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. మొత్తంగా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో మంచు విష్ణుకు మాత్రమే నలుగురు పిల్లలు ఉన్న సంగతి విధితమే.

  పిల్లలు కావాలంటే ఇంకొకరిని చూసుకో

  పిల్లలు కావాలంటే ఇంకొకరిని చూసుకో

  ‘మోసగాళ్లు' సినిమా విడుదలకు సమయం దగ్గరపడడంతో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నాడు విష్ణు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడాడు. ‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే విరానికతో దీని గురించి అడిగా. అప్పుడు నా వల్ల కాదు.. ఇంకెవరినైనా చూసుకో అనేసింది' అంటూ చెప్పుకొచ్చాడతను.

  భార్య గురించి చెప్పగానే జగన్‌ తిట్టాడు

  భార్య గురించి చెప్పగానే జగన్‌ తిట్టాడు

  ఏపీ సీఎం జగన్‌తో జరిగిన ఓ ఫన్సీ సంఘటన గురించి చెబుతూ.. ‘విన్నీ నాలుగో నెల గర్భిణిగా ఉన్నప్పుడు జగన్ అన్న దగ్గరకు వెళ్లి.. అన్నా షీ ఈజ్ ఎక్స్‌పెక్టింగ్ చైల్డ్ అని అంటే.. స్టాప్ అబ్యూజింగ్ మై సిస్టర్.. మీకు పిల్లలు చాలు ఇంక కనకండి అని అన్నారు. అందరం కలిసి తెగ నవ్వుకున్నాం' అంటూ తన పర్సనల్ మేటర్స్‌ను లీక్ చేశాడు మంచు వారి అబ్బాయి విష్ణు.

  English summary
  Vishnu Manchu is an Indian actor and producer known for his works in Telugu cinema and television. He had a brief stint as a child artist with the 1985 film Ragile Gundelu. Years later, he starred in the 2003 Telugu action film Vishnu, for which he won the Filmfare Best Male Debut.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X