Valentine's Day: 11 ఏళ్ల ప్రేమాయణం.. లాస్ట్ మినిట్ వరకు ట్విస్ట్‌లు, రోజా - సెల్వమణి లవ్‌స్టోరీ తెలుసా?

ఆర్కే రోజా.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల్లో , రాజకీయాలలో సత్తా చాటిని అరుదైన వ్యక్తుల్లో ఒకరు. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా .. సెల్వమణిల మధ్య ప్రేమ , పెళ్లి గురించి ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.

చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని భాకరాపేటలో రోజా పుట్టారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం ప్రేమ తపస్సు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. తెలుగు, తమిళ , కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. దక్షిణాదిలోని అందరు అగ్ర హీరోల సరసన నటించిన రోజా.. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు.

ysrcp leader rk roja 11 years love story and marriage with director selvamani

ఇండస్ట్రిలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకపోయినా తన కృషి, పట్టుదలతో అగ్రనటిగా ఎదిగారు. తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ కావడంతో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ ఏ పని చెప్పినా సమర్ధవంతంగా నిర్వహించి తెలుగు మహిళ అధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. 2009లో టీడీపీ అభ్యర్ధిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోజా.. తర్వాతి కాలంలో తెలుగుదేశానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు రోజా. 2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించగా .. వైసీపీ సైతం అధికారంలోకి రావడంతో ఆమెను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు జగన్. అనంతర కాలంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రోజాకు అవకాశం కల్పించారు. అయితే 2024 ఎన్నికల్లో రోజా ఓటమి పాలవ్వడంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితం అయ్యారు.

ysrcp leader rk roja 11 years love story and marriage with director selvamani

రోజా వ్యక్తిగత జీవితానికి వస్తే.. హీరోయిన్‌గా ఉన్నప్పుడే దర్శకుడు ఆర్కే సెల్వమణితో ఆమె ప్రేమలో పడ్డారు. తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న దశలో చెంబురతి సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టారు రోజా. దీనికి సెల్వమణియే దర్శకుడు.. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే రోజాను ప్రేమిస్తున్న విషయం తొలుత ఆమె తల్లిదండ్రులకే చెప్పి వారి అనుమతితోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు సెల్వమణి. అటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ త్వరగానే వచ్చింది.

అయినప్పటికీ దాదాపు 11 ఏళ్ల పాటు వీరి పెళ్లి జరగలేదట. దీనికి కారణం లేకపోలేదు.. తాను హీరోయిన్ కావడం కోసం రోజా అన్మదమ్ములు వారి జీవితాలను సైతం పక్కనపెట్టి ఈమెతోనే ఉండిపోయారట. అందుకే అన్నదమ్ములను సెటిల్ చేసి తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట రోజా. అదే సమరం. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు ఏర్పడటంతో పాటు రోజా పలుమార్లు గాయపడ్డారు కూడా .

అయినప్పటికీ సినిమాను పూర్తి చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఇది డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో రోజా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ ఆర్ధిక ఇబ్బందుల నుంచి కోలుకోవడానికి మరిన్ని సినిమాల్లో నటించాల్సి వచ్చిందట. అలా కష్టాలను దాటుకుని రోజా - సెల్వమణిలు 2002లో పెళ్లిపీటలెక్కారు. ఈ దంపతులకు కుమార్తె అన్షు మాలిక, కుమారుడు కృష్ణ లోహిత్ జన్మించారు. అలా తమ లవ్ స్టోరీకి శుభం కార్డ్ వేసిన ఈ జంట.. జీవితంలో గెలిచి చూపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.

More from Filmibeat

Read more about: movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X