మర్యాదగా ఆ వీడియోలు తీయండి.. లేదంటే అదే చేస్తా!! శ్రీ రెడ్డి బహిరంగ హెచ్చరిక

టాలీవుడ్, కోలీవుడ్ సినీ పెద్దలకు చుక్కలు చూపిస్తూ సంచలన తారగా దేశవ్యాప్త పాపులారిటీ తెచ్చుకుంది శ్రీ రెడ్డి. ఆమె చేసిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి ముందు అసలు శ్రీ రెడ్డి అంటేనే చాలా మందికి తెలియదు. అలాంటిది సినీ వర్గాలపై సంచలన కామెంట్స్ చేస్తూ దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద అందరి నోళ్ళలో నానింది శ్రీ రెడ్డి. కాగా తాజాగా శ్రీ రెడ్డి ఓ విషయమై బహిరంగంగా హెచ్చరించడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటా విషయం? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

పోలీస్ స్టేషన్‌లో శ్రీ రెడ్డి- రాకేష్ మాస్టర్ వివాదం

పోలీస్ స్టేషన్‌లో శ్రీ రెడ్డి- రాకేష్ మాస్టర్ వివాదం

గత కొన్ని రోజులుగా శ్రీ రెడ్డి- రాకేష్ మాస్టర్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ రెడ్డి- రాకేష్ మాస్టర్ మధ్యలో కరాటే కళ్యాణి కూడా దూరి సంచలనం సృష్టించడంతో ఈ ఇష్యూ మరిన్ని చర్చలకు దారితీయడమే గాక, పోలీస్ స్టేషన్ దాకా చేరింది.

 పోలీస్ కేసులు.. బూతు పదజాలం

పోలీస్ కేసులు.. బూతు పదజాలం

ఓ వైపు శ్రీ రెడ్డి, మరోవైపు రాకేష్ మాస్టర్, ఇంకోవైపు కరాటే కల్యాణి ఇలా ఎవరికి వారు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిలు శ్రీ రెడ్డిపై పోలీస్ కంప్లైంట్ చేయడమే గాక, బూతు పదజాలంతో కామెంట్స్ చేసింది. అలాగే రాకేష్ మాస్టర్ కూడా శ్రీ రెడ్డిపై ఫిర్యాదు చేశాడు.

 శ్రీ రెడ్డి బహిరంగ హెచ్చరిక..

శ్రీ రెడ్డి బహిరంగ హెచ్చరిక..

ఇదిలాఉంటే తాజాగా రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌కి బహిరంగ హెచ్చరిక జారీ చేసింది శ్రీ రెడ్డి. ఈ మేరకు సదరు ఇంటర్వ్యూ ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని పేర్కొంటూ తన సోషల్ మీడియా ఖాతాలో సందేశం పెట్టింది.

 లీగల్ నోటీసులు పంపిస్తా..

లీగల్ నోటీసులు పంపిస్తా..


తనను కించపరుస్తూ కొరియోగ్రాఫర్ రాకేష మాస్టర్ కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలు కొన్ని యూట్యూబ్ చానెళ్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాకేష్ మాస్టర్ తన గురించి మాట్లాడిన ఇంటర్వ్యూలను తొలగించకపోతే.. ఆ ఛానల్స్‌కి లీగల్ నోటీసులు ఇస్తానని వార్నింగ్ ఇస్తూ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

శ్రీ రెడ్డిపై నెటిజన్స్ ప్రశ్నల వర్షం

శ్రీ రెడ్డిపై నెటిజన్స్ ప్రశ్నల వర్షం

దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ తిరిగి శ్రీ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నువ్వు కూడా ఇలాగే టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాలపై బూతులు తిడుతూ ఇంటర్వ్యూలు ఇచ్చావు కదా! మరి వాటి సంగతేంటి? నీకు కూడా లీగల్ నోటీసులు పంపాలా? అనే కోణంలో కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీ రెడ్డి క్యారెక్టర్‌.. ప్రతాపం చూపించేందుకు రెడీ

శ్రీ రెడ్డి క్యారెక్టర్‌.. ప్రతాపం చూపించేందుకు రెడీ

ఇకపోతే ఇన్నాళ్లు టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై విరుచుకు పడుతూ బూతు కామెంట్లు పెట్టిన శ్రీ రెడ్డి.. ఏకంగా వెండితెరపై కూడా తన ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతుండటం విశేషం. తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి వెండితెర రూపమివ్వబబోతోంది శ్రీ రెడ్డి.

Recommended Video

Sri Reddy Negative Facebook Post On HIT Movie And Hero Nani | Filmibeat Telugu
 క్లైమాక్స్‌‌లో శ్రీ రెడ్డి

క్లైమాక్స్‌‌లో శ్రీ రెడ్డి

ఈ మేరకు ఇటీవలే క్లైమాక్స్ అనే సినిమా సెట్స్‌పై చేరింది శ్రీ రెడ్డి. క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ రెడ్డి పాత్రను హైలైట్ చేస్తూ పలు కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X