నిర్మాత అల్టిమేటమ్ : కోటితో సెట్ వేసాం...వేస్ట్ చేయకు

By Srikanya

చెన్నై : గతకాలంలో సెట్ అనేది అవసముంటేనే వేసేవారు. అంతేకాకుండా సెట్స్...సినిమాలో అంతర్బాగంగా ఉంటూ,కథనానికి సహకరిస్తూ ఉండేవి. అయితే బాగా ఖర్చుపెట్టి సెట్ వేయటమనేది ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. డిస్ట్రిబ్యూటర్స్ ని ఆకట్టుకోవటానికి దర్శక,నిర్మాతలు వీటిని పబ్లిసిటీకి వాడుతున్నారు. మద్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై పి.నందగోపాల్‌ నిర్మిస్తున్న చిత్రం 'రోమియో జూలియట్‌'. ఈ చిత్రం కోసం వేసిన సెట్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ చిత్రంలో జయంరవి, హన్సిక జంటగా నటిస్తున్నారు. పూనంభజ్వా కూడా ముఖ్యపాత్ర పోషిస్తోంది. వీరితోపాటు వీటీవీ గణేశ్‌ హాస్య పాత్రలో నటించారు. చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కథలో ప్రధాన భాగంగా ఉండే ఓ అధునాతన ఇంటి కోసం రూ.కోటితో ప్రత్యేక సెట్‌ వేశారు కళా దర్శకుడు మిలన్‌. అంత ఖర్చు పెట్టి సెట్ వేసాం కాబట్టి దాన్ని పూర్తిగా వాడుకోమని, తెరపై ఆ ఖర్చు కనిపించాలని నిర్మాత...దర్శకుడుని అంటున్నాడుట.

1 Cr set for for Romeo Juliet film

దర్శకుడు లక్ష్మణన్‌ మాట్లాడుతూ.. '' జయంరవి, హన్సిక రెండోసారి జతకడుతున్నారు. ఇందులో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. ప్రేమికులకు ఈ సినిమా కనువిందుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇందులో రూ.కోటితో అందమైన ఇంటి సెట్‌ వేశారు మిలన్‌. అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రస్తుతం కీలక సన్నివేశాలను అక్కడే తెరకెక్కిస్తున్నాం. దీపావళి ముందు ఈ సినిమాను విడుదల చేస్తాము''అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X