'భేతాళుడు‌': రిలీజ్‌కు ముందే పది నిమిషాల క్లిప్ ఆన్‌లైన్‌లో..! (ఇదిగో వీడియో)

By Srikanya

చెన్నై: రిలీజ్ కు ముందు తమ సినిమాల్లో చిన్న అంశం బయిటకు వచ్చినా పెద్ద ప్రమాదం జరిగిపోయినట్లుగా దర్శక,నిర్మాతలు భయపడుతూంటారు. అయితే బిచ్చగాడు చిత్రంతో తెలుగు వారికి దగ్గరైన విజయ్ ఆంటోని ఆ విషయంలో రివర్స్ లో ఉన్నారు. తమ సినిమా ఓ పది నిముషాలు పాటు చూస్తే ఖచ్చితంగా మిగతా సినిమా చూడటానికి జనం ధియేటర్ కు వస్తారని భావించారు. అందుకోసం ఆయనే స్వయంగా ఓ పది నిముషాల వీడియో క్లిప్ ని విడుదల చేసారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...విజయ్ ఆంటోనీ 'సైతాన్' అనే సినిమాతో త్వరలో మన ముందుకు వస్తోన్న తెలిసిందే. భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాను తెలుగులో 'బేతాళుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ట్రైలర్‌తో ఇక్కడ కూడా ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక అన్నీ కుదిరితే ఈ శుక్రవారమే విడుదల కావాల్సిన ఈ సినిమా, కరన్సీ బ్యాన్ వల్ల వాయిదా పడింది. అయితే తన సినిమా కు క్రేజ్ తగ్గకూడదని ఆయన భావించారు.

10 mins video clip from Saithan movie :Saithan Hunts for Jayalakshmi (10 mins Video)

తమిళ వర్షన్‌కు సంబంధించిన సైతాన్ ... మొదటి పది నిమిషాల ఓపెనింగ్ సీక్వెన్స్‌‌ను విజయ్ ఆంటోనీ యూట్యూబ్‌లో విడుదల చేశారు. జయలక్ష్మిని అన్వేషిస్తూ... వచ్చే ఈ ఓపెనింగ్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను పతాక స్దాయికి తీసుకెళ్ళేలానే ఉంది. ఆ క్లిప్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ సన్నివేశాలను చూసిన ప్రతి ఒక్కరికీ.. 'ఎవరు ఆ జయలక్ష్మి?' అనే ప్రశ్న తలెత్తుతోంది.ఆ ప్రశ్నకు డిసెంబర్ 2 న సమాధానం లభిస్తుందని చెబుతున్నారు ఆరా సినిమాస్‌ అధినేత మహేష్‌ గోవిందరాజ్‌.

దర్శకుడిగా తన తొలి చిత్రమిదని, సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించామని, జయలక్ష్మి అనే మహిళ కోసం ఓ యువకుడు సాగించిన అన్వేషణ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని దర్శకుడు పేర్కొన్నారు.

అందరితో పాటు తాను సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు విజయ్ ఆంటోని చెప్పారు. బిచ్చగాడు సినిమా రీమేక్ హక్కులు తీసుకోవడానికి తెలుగులో చాలా మంది నిర్మాతలు ముందుకువచ్చారని, కానీ విజయ్ ఆంటోని మాత్రం అనువాద రూపంలో విడుదల చేయాలని నిర్ణయించారని, అదే అతడికి మంచి పేరును తీసుకొచ్చిందని ఫాతిమా విజయ్ ఆంటోని అన్నారు.

విజయ్ ఆంటోని, అరుంధతి నాయర్ జంటగా నటించిన తమిళ చిత్రం సైతాన్. ఈ సినిమాను భేతాళుడు పేరుతో నిర్మాతలు కె.రోహిత్, ఎస్. వేణుగోపాల్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. మల్కాపురం శివకుమార్ సమర్పకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X