భార్యకు విడాకులు ఇచ్చిన టాప్ హీరో.. హార్ట్ బ్రేక్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్!
తమిళ నటుడు జయం రవి గత కొద్దికాలంగా తన దాంపత్య జీవితం గురించి వస్తున్న వార్తలకు తెర దించారు. భార్యతో విభేదాలు ఉన్నాయంటూ ఆయన ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తన భార్య ఆర్తి నుంచి అధికారికంగా కోర్టు నుంచి విడాకులు తీసుకొన్నారు. ఈ మేరకు ఆయన ఓ భావోద్వేగమైన లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..
జీవితమనే పుస్తకంలో ఎన్నో చాప్టర్లతో నిండి ఉంటుంది. ప్రతీది ఓ అవకాశం.. ఓ ఛాలెంజ్‌ను విసురుతుంది. నా సినిమా కెరీర్‌ను, నా వ్యక్తిగత జీవితాన్ని మీరంతా ఎంతో ప్రేమతో అనుసరించి ఎంతో సపోర్ట్ ఇచ్చారు అందులో ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేవు అని ఆయన భావోద్వేగంతో లేఖలో పేర్కొన్నారు.

మీరు, నా ఫ్యాన్స్ ఎలాంటి ప్రేమను కురిపించినారో.. అలాగే నేను కూడా మీతో అందే పారదర్శకతతో ఉన్నాను. అందుకే భారమైన గుండెతో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకొంటున్నాను అని జయం రవి తన పోస్టులో పేర్కొన్నారు. నా జీవిత భాగస్వామితో తలెత్తిన విభేదాల కారణంగా విడాకులు తీసుకొన్నాను. అనేక విషయాలపై చర్చించి.. తర్జనభర్జన పడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొన్నాను అని ఆయన అన్నారు.
నా భార్యతో విడిపోవాలన్న నిర్ణయం తొందరపడి తీసుకోలేదు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకొన్నాం. ఇద్దరికి ప్రయోజనం కలిగే విధంగా విడిపోవాలని అనుకొన్నాం. మా వైవాహిక జీవితంలో జరిగిన ఈ సంఘటనపై ఎలాంటి ఊహాగానాలకు తావు లేదు అని జయం రవి తెలిపారు.

నా జీవితంలో సినిమాకే అత్యంత ప్రాధాన్యం. మీకు నచ్చిన విధంగా మీకు వినోదాన్ని కలిగించడమే నా ప్రయారిటి. నేను ముందున్నట్టుగానే ఇప్పటికీ మీ జయం రవిగానే ఉంటాను. ఈ నిర్ణయం కెరీర్‌కు మరింత మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. నా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని అనుకొంటున్నాను అని ఆయన ఎమోషనల్ అయ్యారు.
నా జీవితంలో చోటు చేసుకొన్న భావోద్వేగమైన సంఘటన నేపథ్యంలో నా ప్రైవసీకి, నా కుటుంబ సభ్యుల ప్రైవసీకి భంగం కలిగించకూడదని వేడుకొంటున్నాను అని జయం రవి కోరారు. ఆర్తితో 2009లో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాతో మంచి పాపులారిటిని సంపాదించుకొన్నారు.


Click it and Unblock the Notifications











