కమల్,రజనీ ఫ్యాన్స్ కు శుభవార్త
చెన్నై : వెండితెరపై అలనాటి మేటి రాజసాలు ఆధునిక సొబగులు అద్దుకుని ఇటీవల ప్రేక్షకుల చెంతకొస్తున్నాయి. ఈ జాబితాలో మరో చిత్రం కూడా చేరనుంది. భారతిరాజా దర్శకత్వంలో కమల్‌హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ప్రధానపాత్రలుగా తెరకెక్కి 1977లో విడుదలైన సినిమా '16 వయిదినిలే'. రజనీకాంత్ విలన్ గా కనిపించాడు. 'సెందూర పూవే..' అన్న పాట ఇప్పటికీ నిత్య నూతనమే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని డిజిటల్ హంగులతో మళ్లీ జనం ముందుకు తెస్తున్నారు. ఆధునిక సాంకేతికతో మరింత ఆకర్షణగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి. త్వరలోనే థియేటర్లలోకి రానుంది.
మరోప్రక్క చాలా కాలం గ్యాప్ తర్వాత కమల్‌హాసన్, శ్రీదేవి జంటగా నటించబోతున్నారనే వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. దాదాపు 30 ఏళ్ల కిందట వారిద్దరూ 'సద్మా' చిత్రంలో నటించారు. ఇటీవలే 'ఇంగ్లిష్ వింగ్లిష్'తో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు శ్రీదేవి. ఈ నేపథ్యంలో కమల్ ఆమె కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
మరో ప్రక్క కమల్ హాసన్ త్వరలో ఓ హాలీవుడ్ చిత్రం చేయబోతున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నిర్మాత బ్యారీ అబ్స్ బోర్న్ తో కలిసి కమల్ ఈ చిత్రం చేయనున్నారు. కమల్ దర్శకత్వం వహించి నిర్మించిన విశ్వ రూపం చిత్రం చూసి ఆయనతో చిత్రం చేయటానికి ముందుకు వచ్చారు. ఈ చిత్రం టైటిల్ 'All are Kin'...అంటే తెలుగులో అంతా మనవాళ్లే అని. ఈ చిత్రం భారతీయ సంస్కృతి,చరిత్రను ఉద్దేశించి ఉంటుంది. ఈ చిత్రానికి కమల్ కి మంచి రెమ్యునేషన్ ముట్టనున్నదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











