రజనీకాంత్ క్రేజ్.... ఒక్కో టిక్కెట్ రూ. 60 వేల నుండి 4 లక్షలు!

రజనీకాంత్ నటించిన రోబో 2.0 మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 27న దుబాయ్‌లో గ్రాండ్‌గా జరుగబోతోంది.

By Bojja Kumar

Recommended Video

2.0 Audio Launch Event Tickets Are Being Sold For A Whopping Rs 4 Lakhs

రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న '2.0' మూవీ ప్రతి విషయంలోనూ భారీ తనమే ప్రదర్శిస్తోంది. ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియో వేడుక కనీవినీ ఎరుగని రీతిలో కోట్లాది రూపాయల ఖర్చుతో దుబాయ్‌లో నిర్వహించబోతున్నారు.

రోబో 2.0 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఆడియో రిలీజ్ వేడుక ఈనెల 27న దుబాయ్‌లో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. యావత్ ప్రపంచం దృష్టి తమ సినిమాపై పడేలా దుబాయ్‌లో ఈ వేడుక అట్టహాసంగా జరుగబోతోంది. ఈవెంటును రూ. 12 కోట్ల ఖర్చుతో నిర్వహించబోతున్నట్లు సమాచారం.

 ఈవెంట్ టికెట్ ధర రూ.60 వేల నుండి 4 లక్షలు

ఈవెంట్ టికెట్ ధర రూ.60 వేల నుండి 4 లక్షలు

భారీ ఖర్చుతో అక్కడ జరగనున్న ఆడియో ఈవెంట్ ను వీక్షించాలన్నా భారీగా ఖర్చు పెట్టాల్సిందే. ఒక్కో టికెట్ ధర రూ.60 వేలు అమ్ముతున్నారు. ఇక వీఐపీ టికెట్స్ ఒక్కోటి రూ. 4 లక్షలకు అమ్మినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ వీరాభిమానులు ఎంత ఖర్చైనా పెట్టి వెళ్లేందుకు వెనకాడటం లేదు.

 'బుర్జ్ ఖలీఫా' పార్క్

'బుర్జ్ ఖలీఫా' పార్క్

దుబాయ్ లోని 'బుర్జ్ ఖలీఫా' పార్క్ .. ‘2.0' సినిమా ఆడియో వేడుకకు వేదికగా మారుతోంది. సౌత్ సినిమాలకు సంబంధించి ఇక్కడ ఈ స్థాయిలో ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

 ఏఆర్ రెహమాన్ సంగీతం

ఏఆర్ రెహమాన్ సంగీతం

‘2.0' చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రానికి ఆయన అందించిన సంగీతం ఏ స్థాయిలో ఉంటుందో అని సంగీత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 ఇండియన్ బిగ్ 3డి ఫిల్మ్

ఇండియన్ బిగ్ 3డి ఫిల్మ్

3డి ఎఫెక్టులతో ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించనుంది. ఇండియాలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న 3డి సినిమా ఇది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి త్రీడీ మేకింగ్ వీడియోను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.

 వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం మాట్లాడుతూ - ''రజనీకాంత్‌గారితో శంకర్‌గారు చేస్తున్న మరో అద్భుతమైన చిత్రమిది. ఈనెల 27న దుబాయ్‌లో ఈ చిత్రం ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేశాం'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X