సంచలనం దిశగా శంకర్ 2.0.. దుబాయ్‌లో ఒకే రోజు 100 షోలు!
Recommended Video

దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 2.0 చిత్రం సంచలనాలు మొదలవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారత సినీ చరిత్రలో మునుపెన్నడూ రూపొందని విధంగా ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు. ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్, హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ వందల సంఖ్యలో ఈ చిత్రం కోసం పని చేయడం విశేషం. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కళ్ళు చెదిరే పోస్టర్లతో చిత్ర యూనిట్ ఆసక్తిని పెంచుతోంది. నవంబర్ 29న 2.0 చిత్రం విడుదల కానుండగా ప్రీమియర్ షోల గురించి ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

ఒకే రోజు 100 షోలు
2.0 చిత్రానికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక్క దుబాయ్ లోనే ఒకే రోజు 100 షోలు ప్రదర్శించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దుబాయ్ లోని అతిపెద్ద మల్టిప్లెక్స్ లో 2.0 ప్రీమియర్ షాలిని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఈ స్థాయిలో దుబాయ్ లో ఇంతవరకు మరే చిత్రాన్ని ప్రదర్శించలేదు. ఒకేరోజు 100 షోలతో శంకర్ 2.0 రికార్డు నెలకొల్పబోతోందని అంటున్నారు.

కనీవినీ ఎరుగని బడ్జెట్
2.0 చిత్రానికి కనివిని ఎరుగని స్థాయిలో 600 కోట్ల బడ్జెట్ వెచ్చించారు. శంకర్ దర్శత్వం, సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ తోనే ఎక్కువ భాగం వసూళ్లు నమోదవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడ్జెట్ లో ఎక్కువభాగం చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ కోసమే వెచ్చించినట్లు తెలుస్తోంది. 2.0 విడుదల ఆలస్యం కావడానికి కూడా కారణం ఇదే.

పదివేల థియేటర్స్
2.0 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పదివేల థియేటర్స్ లో విడుదలవుతుందని అంచనా. ఈ చిత్ర ఓపెనింగ్స్ ఊహకందని విధంగా ఉండబోతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది.

భయంకర విలన్
అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో భయంకర రూపాలతో ఆకర్షిస్తున్నాడు. పోస్టర్స్ లోనే అతడి రూపం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. ఇక థియేటర్ లో అతడి విన్యాసాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ చిత్రంతో శంకర్ మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారడం పై చక్కటి సందేశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అమీజాక్సన్ హీరోయిన్ గా నటించింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో 2.0 చిత్రం తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











