Just In
- 10 hrs ago
నాని పని అయిపోయిందా..? వైరల్‌గా మారిన పోస్ట్
- 10 hrs ago
ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా.. జీవిత రాజశేఖర్ కామెంట్స్
- 11 hrs ago
మహేష్ ముచ్చట్లకు విజయశాంతి ఆశ్చర్యం.. సూర్యుడివో చంద్రుడివో అంటూ హల్చల్
- 11 hrs ago
రాంగోపాల్ వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ అందించిన కేఏ పాల్.. మామూలుగా వాడుకోలేదుగా.!
Don't Miss!
- Lifestyle
సోమవారం మీ రాశిఫలాలు 9-12-2019
- Sports
రెండో టీ20లో సిమ్మన్స్ హాఫ్ సెంచరీ.. వెస్టిండీస్ ఘన విజయం
- News
చట్టాల మార్పులు సరిపోవు: మహిళలపై నేరాలపై వెంకయ్యనాయుడు
- Finance
ఆర్బీఐ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్
- Technology
ఆపిల్ వాచీల కోసం కొత్త ఫీచర్, చిర్ప్ 2.0
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
2.0 చైనా రిలీజ్ ఆగిపోయిందా? అందుకే చేతులెత్తేశారా?
రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందించిన చిత్రం 2.0. ఇండియన్ సినిమా చరిత్రలోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఖర్చు చేసి లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాబట్టలేక చతికిల పడిన సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేయడం ద్వారా నష్ఠాలను పూడ్చుకోవాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. చైనాలో అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'హెచ్‌వై మీడియా'కు ఇందుకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. చైనాలో ఈ చిత్రాన్ని 50 వేలకు పైగా స్క్రీన్లలో విడుదల చేయబోతున్నట్లు ఆర్బాటంగా ప్రకటనలు చేశారు.

ఇప్పటికే చైనాలో 2.0 మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. కొన్ని రోజుల క్రితమే జులై 12న రిలీజ్ డేట్ లాక్ చేశారు. అయితే ఇపుడు 'హెచ్‌వై మీడియా' సంస్థ 2.0 మూవీ విషయంలో చేతులు ఎత్తేసినట్లు తెలుస్తోంది.
జులై 19న డిస్నీ సంస్థ రూపొందించిన యానిమేటెడ్ మూవీ 'లయన్ కింగ్' విడుదలవుతోంది. ఈ సమయంలో 2.0 విడుదల చేస్తే నష్టం తప్పదనే ఆలోచనతో రిలీజ్ విషయంలో చేతులు ఎత్తేసిందట. గతంలో ఈ సంస్థ ఇండియాకు చెందిన 'ప్యాడ్ మ్యాన్' చిత్రాన్ని చైనాలో విడుదల చేసి భారీగా నష్టపోయింది. మరోసారి అలాంటి రిస్క్ చేయడానికి ఆ సంస్థ సిద్ధంగా లేదని టాక్. త్వరలోనే 2.0 చైనా రిలీజ్ విషయంలో ఓ క్లారిటీ రానుంది.
2.0 చిత్రాన్ని దాదాపు రూ. 545 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. బాహుబలిని మించిన విజయం సాధిస్తుందని అంచనా వేశారు. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం ఫెయిలైంది. దీంతో నిర్మాతలు నష్టోపోక తప్పలేదు.