2.0 టైలర్ రిలీజ్ లైవ్ అప్‌డేట్స్.. హిస్టరీలోనే తొలిసారిగా..

Recommended Video

2.0 Movie Trailer Launch Event 2.0 సినిమా ట్రైలర్ లాంచ్

సూపర్‌స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రానున్న 2.0 చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. వేడుక కోసం చెన్నైలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం కోసం పలువురు ప్రముఖులు తరలివచ్చారు. వేడుక కోసం భారీస్థాయిలో మీడియా హాజరైంది. చెన్నైలో ట్రైలర్ రిలీజ్ వేడుక సందర్బంగా లైవ్ అప్‌డేట్స్ మీ కోసం...

 500 కోట్ల వ్యయంతో

500 కోట్ల వ్యయంతో

2.0 చిత్రం రజనీ, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన రోబో సినిమాకు రీమేక్. ఈ చిత్రాన్ని సుమారు 500 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, ఆడియో రిలీజ్ వేడుకను ముంబై, దుబాయ్‌లో నిర్వహించారు.

3డీ టెక్నాలజీతో ట్రైలర్

ప్రస్తుతం రోబో సీక్వెల్ 2.0 ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా 3డీ టెక్నాలజీకి సంబంధించిన కిట్లను మీడియాకు అందజేశారు. ఈ సినిమాను, ట్రైలర్‌ను 3డీ టెక్నాలజీలో రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకు భారీగా మీడియా తరలిరావడంతో అదుపు చేయడం కష్టంగా మారినట్టు సమాచారం. ఫొటోగ్రాఫర్లను, వీడియో జర్నలిస్టులను సహకరించాలని పదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది.

 కుటుంబ సభ్యులతో కలిసి

కుటుంబ సభ్యులతో కలిసి

చెన్నై సత్యం సెంటర్లలో జరిగిన 2..0 ట్రైలర్ రిలీజ్ వేడుకకు రజనీ, శంకర్ కుటుంబ సమేతంగా తరలివచ్చారు. భార్య లతతో రజనీ రాగా, శంకర్ తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో వేదిక వద్దకు వచ్చారు. అక్షయ్ కుమార్ రాకతో వేదిక వద్ద అలజడి చోటుచేసుకొన్నది.

ప్రతిష్టాత్మకంగా వేడుక

ప్రతిష్టాత్మకంగా వేడుక

ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 2.0 వేడుక కోసం దేశవ్యాప్తంగా ఉన్న మీడియాను, జాతీయ మీడియాను ఆహ్వానించారు. ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్లు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ప్రపంచ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం.

తొలిసారి 4డీ సౌండ్ సిస్టమ్

తొలిసారి 4డీ సౌండ్ సిస్టమ్

భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి 4డీ సౌండ్ సిస్టమ్‌లో 2.0 రూపొందించారు. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ కోసం నాలుగేళ్లు కఠోరంగా శ్రమించాం. అద్భుతమైన క్వాలిటీ ఇచ్చిన రసూల్ పూకుట్టికి నా థ్యాంక్స్ అని దర్శకుడు శంకర్ అన్నారు. 2.0 సినిమాకు పనిచేయడం మరచిపోలేని అనుభవం. రెండేళ్లు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశామని సౌండింగ్ టెక్నిషియన్స్ పేర్కొన్నారు.

వెన్నులో చలిపుట్టింది.. రెహ్మాన్

వెన్నులో చలిపుట్టింది.. రెహ్మాన్

ఏఆర్ రెహ్మన్ మాట్లాడుతూ.. జనవరి 3, 2016 తేదీన శంకర్ నన్ను పిలిచి 2.0 కథ చెప్పాడు. ప్రపంచ సినిమాలోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా శంకర్ ప్లానింగ్ చేస్తున్న తీరు చూసి నాకు వెన్నులో చలిపుటింది అని ఏఆర్ రెహ్మాన్ అన్నారు. సినిమా రంగంలో నాకు ఇష్టమైన హీరో రజనీకాంత్ అని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

రిటైర్ అవుదామని అనుకొన్నా.. కానీ

రిటైర్ అవుదామని అనుకొన్నా.. కానీ

ట్రైలర్ రిలీజ్ వేడుకలో ఏఆర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. అస్కార్ అవార్డు అందుకొన్న తర్వాత సినిమా రంగం నుంచి రిటైర్ అవుదామనుకొన్నాను. కానీ రజనీకాంత్ నాకు ఇన్సిపిరేషన్‌గా నిలిచారు. రొబో సినిమా చూసిన తర్వాత నా ఆలోచనను మానుకొన్నాను అని రెహ్మాన్ చెప్పారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని తట్టుకొని నిలిచిన రజనీ సార్ అంటే ఇష్టం. ఆయనలో ఉండే అధ్యాత్మిక చింతన నాకు బాగా నచ్చిందన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X