twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2 నిమిషాలకే.. ఏంటిది శంకర్.. భారతీయుడు2 గురించి క్రేజీ న్యూస్!

    |

    భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నారు. 600 కోట్ల భారీ బడ్జెట్ లో శంకర్ రూపొందించిన 2.0 చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత శంకర్ భారతీయుడు 2 చిత్రాన్ని రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. భారతీయుడు 2 చిత్ర షూటింగ్ కు అంతా సిద్ధం అయింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు, షూటింగ్ వివరాల గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. భారతీయుడు 2 చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

    సంగీత దర్శకుడు ఖరారు

    సంగీత దర్శకుడు ఖరారు

    శంకర్ ఎక్కువగా తన చిత్రాలకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ని ఎంపిక చేసుకుంటాడు. 2.0 చిత్రానికి కూడా ఏఆర్ రెహమనే సంగీత దర్శకుడు. కాగా భారతీయుడు 2 చిత్రానికి యువ సంచలనం అనిరుద్ రవిచంద్రన్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. 22 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్ర సీక్వెల్ కి అనిరుద్ ని ఎంపిక చేసుకోవడం విశేషం.

    రెండు నిమిషాలకే

    రెండు నిమిషాలకే

    ఈ చిత్రంలో కేవలం రెండు నిమిషాల సన్నివేశం కోసమే రెండు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. బంగారు వర్ణంలో బిస్కెట్స్ ని పోలిన ఆకారాలతో భారీ సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో కేవలం రెండు నిమిషాల సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. సెట్ లోపలకి వెళితే అద్భుతమైన అనుభూతి కలుగుతున్నట్లు సమాచారం. 2 నిమిషాల సన్నివేశం కోసం 2 కోట్ల ఖర్చా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

    కీలక పాత్రల్లో

    కీలక పాత్రల్లో

    ఈ చిత్రంలో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. కాజల్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని సమాచారం. ఇక తెలుగు కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇక మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ హీరో శింబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

    కమల్ నట విశ్వరూపం

    కమల్ నట విశ్వరూపం

    కమల్ హాసన్ తన సుదీర్ఘ సినీ కెరీర్ లో ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. ఆయన పోషించిన పాత్రలతోనే ప్రాణం పోసుకున్న చిత్రాలు అనేకం ఉన్నాయి. కమల్ అద్భుతమైన నటన కనబరిచిన చిత్రాల్లో భారతీయుడు ఒకటి. ఆ చిత్రానికి సీక్వెల్ గా రూపొందితున్న చిత్రం కావడం, పైగా ఇదే తన చివరి చిత్రం అని చెప్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. కమల్ హాసన్ నట విశ్వరూపం కోసం ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.

    English summary
    2 crore set for Indian 2 of only 2 minute sequence. Anirudh Ravichander is the musc director for Indian2
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X