»   » ఘోర ప్రమాదం ఇద్దరు మృతి: ప్రభుదేవా సినిమా కోసమే

ఘోర ప్రమాదం ఇద్దరు మృతి: ప్రభుదేవా సినిమా కోసమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

షూటింగ్ కోసం బయల్దేరిన ఆ బృందాన్ని విషాదం వెంటాడింది. ఊహించని ప్రమాదం ఇద్దరి ప్రాణాలని బలితీసుకుంది తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సినిమా షూటింగ్ బృందానికి చెందిన ఓ వ్యక్తితో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. తంజావూరు జిల్లా కుంభకోణం వద్ద సినిమా షూటింగ్ బృందం వెళ్తున్న వ్యాన్, ఎదురు వస్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కుంభకోణం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

2 from Prabhu Deva film crew killed in accident

శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. గత 15 రోజులుగా కుంభకోణం పరిసర ప్రాంతాల్లో ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా నటిస్తున్న 'యంగ్ మంగ్ సంగ్' అనే తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. శుక్రవారం తిరువాయరులోని అయ్యరప్పర్ దేవాలయంలో షూటింగ్ జరిగింది. ఈ సినిమా యూనిట్‌కు సంబంధించిన కొందరు వ్యాన్‌లో భోజనాలు తీసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. వ్యాన్ డ్రైవర్ విజయ్ కుమార్, సినిమా యూనిట్‌కు చెందిన అరుముగం అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.

English summary
Two members of a film crew were killed and five others injured when the van in which they were travelling was hit by a blue metal-laden lorry near Papanasam in Thanjavur district during the early hours on March 31.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu